నెహ్రు సామ్యవాదంతో దశాబ్దాల వెనుకకు భారత్ వృద్ధి 

అర్ధాంతరంగా నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు తీసుకొచ్చిన `సామ్యవాదం’ దేశ ఆర్థికాభివృద్ధిని దశాబ్దాల వెనుకకు నెట్టివేసినదని ప్రముఖ ఆర్ధిక వేత్త డా. డిబెక్  దేబ్రాయ్ తెలిపారు. సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ ఆధాయారంలో బిఆర్ షెనాయ్ మెమోరియల్ ప్రసంగం, 2020 చేస్తూ రాజ్యాంగంలో `సామ్యవాదం’ అర్ధం వచ్చే కొన్ని పదాలు ఉన్నప్పటికీ ఆ పదం ఎక్కడ లేదని స్పష్టం చేశారు. 
 
ఈ ప్రస్తావన వచ్చినప్పుడు భవిష్యత్ తరాలపై ఒక ఆర్ధిక విధానంను రుద్దే విధంగా రాజ్యాంగంలో `సామ్యవాదం’ పదాన్ని ఎక్కడ చేర్చవద్దని రాజ్యాంగసభలో  1948 నవంబర్ 15న డా. బి ఆర్ అంబెడ్కర్ స్పష్టం చేసారని ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి చైర్మన్ కూడా అయిన దేబ్రాయ్ పేర్కొన్నారు. 
 
మొదటి పంచవర్ష ప్రణాళికలో సహితం  పొదుపు,  పెట్టుబడులు లక్ష్యంగా పేర్కొనడమే గాని ఎక్కడా సామ్యవాద ధోరణులు లేనేలేవని తెలిపారు. అయితే అకస్మాత్తుగా నవంబర్, 1954లో జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో `సామ్యవాద తరహా సమాజం’ ను జాతీయ లక్ష్యంగా నెహ్రు ప్రకటించారని ఆయన చెప్పారు. 
 
ఈ విషయమై ఏ దశలో కూడా దేశంలో ఎటువంటి చర్చ జరగలేదని, ఆ తర్వాత రెండు ప్రణాళిక నుండి సామ్యవాదం ధోరణులు పెరుగుతూ వచ్చాయని చెబుతూ దానితో ఐదారు ప్రణాళికల సమయానికి ప్రణాళిక వ్యవస్థ కుప్పకూలి పోయినదని, 1966 నుండి 1969 వరకు ప్రణాళికలకు సెలవు ఇవ్వవలసి వచ్చినదని ఆయన గుర్తు చేశారు. 
 
భారత్ కు స్వతంత్రం వచ్చిన సమయంలో మొత్తం ప్రపంచం మన దేశం పట్ల ఆసక్తిగా చేసినదాని, మన అభివృద్ధి నమూనా మొత్తం ప్రపంచానికి ఆదర్శంగా ఉండగలదని, ఇక్కడొక్క వినూత్నమైన ప్రయోగం జరగబోతున్నదని ఎదురు చూసారని డా. దేబ్రాయ్ తెలిపారు. ఆధునికత, పారిశ్రామికత లక్ష్యాలుగా భారత్ పురోభివృద్ధి సాధించగలదని అంచనా వేశారని చెప్పారు. 
 
అయితే ఆర్ధిక ప్రణాళికలో `సామ్యవాదం’ పేరుతో రాజకీయ సిద్ధాంతాలను జోడిస్తూ రావడంతో భారత్ తప్పుడు విధానాలు అనుసరిస్తున్నదని అంటూ అంతర్జాతీయంగా పలువురు ప్రముఖ ఆర్ధిక వేత్తలు ఆనాడే హెచ్చరించారని ఆయన వివరించారు. భారత్ లో నెహ్రు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలపై 1955లోనే దేశాన్ని ప్రొఫెసర్ బి ఆర్ షెనాయ్ హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు. 
 
ఆ నాడు ఆసియా ఆర్ధిక వేత్తల సదస్సులో భారత్ అభివృద్ధి నమూనా గురించి భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తూ భారత్ అమలు పరుస్తున్న పంచవర్ష ప్రణాళికల పరిధి మితిమీరు ఉంటున్నాయని, అసాధ్యమైన పొదుపు లక్ష్యంగా పెట్టుకొంటున్నారని, ప్రణాళిక కేటాయింపులు వాస్తవికంగా ఉండటం లేదని స్పష్టం చేశారని వివరించారు. 
 
మన ఆర్ధిక ప్రణాళికలో కీలకమైన జాతీయకరణ, ప్రజాకర్షణ అంశాలు మన ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలడానికి దారితీసిన్నట్లు ఆయన పేర్కొన్నారు. నేడు దేశంలో వినిపిస్తున్న `క్రోనీ కాపిటలిజం’ కు నెహ్రు హయాం నుండి అమలు పరుస్తూ వస్తున్న `క్రోనీ సోషలిజం’యే కారణమని డా. దేబ్రాయ్ విమర్శించారు. 
 
సామ్యవాద విధానాల కారణంగా అన్ని వస్తువుల కొరత, లైసెన్స్ రాజ్యం, ప్రభుత్వమే వ్యాపారం చేయడం వంటి పలు కారణాలు మన ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందలేక పోవడానికి దారితీసిన్నట్లు తెలిపారు.