సాధారణంగా దేశ ప్రజలు తమకు ఎన్ని సమస్యలు ఎదురైనా పరిష్కారం కోసం రాష్ట్ర, దేశ ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తారు. వాటిని ఇక్కడే పరిష్కరించుకోవాలని భావిస్తారు. మతం కన్నా దేశ ప్రతిష్ట, సంక్షేమం ముఖ్యంగా భావిస్తారు. కానీ, కేవలం మతపరమైన అంశాలను సాకుగా చూపి, ఇతర దేశ వ్యవస్థలతో చేతులు కలిపి, దేశప్రతిష్టకు భంగం కలిగించేందుకు, దేశ సార్వభౌమాధికారాన్ని విఘాతం కలిగించేందుకు దేశంలోని ఓ క్రైస్తవ సంస్థ చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ విశ్లేషనాత్మక పరిశోధనలో బయటపెట్టింది.
Lodged complaint with Ministry of Home Affairs against 'Persecution Relief' for sending false reports to international agencies resulting in India being declared as a country dangerous for Religious Minorities by @USCIRF.
Routine crimes like ..1/3 pic.twitter.com/GNYxRrbjv1
— Legal Rights Protection Forum (@lawinforce) December 1, 2020
దీనికి ముందు మనం అమెరికా ప్రభుత్వరంగ సంస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (USCIRF) గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రపంచంలో అన్ని దేశాలలో మతపరంగా మైనారిటీలుగా ఉన్న ప్రజల, మరీ ముఖ్యంగా క్రైస్తవుల సామజిక, ఆర్ధిక, సాంఘిక స్థితిగతులపై, వారి భద్రతపై అధ్యయనం చేసి, ఆయాదేశాలు ఆ మైనారిటీలకు ఎంత శ్రేయష్కరం అనే విషయమై నివేదికలు ప్రచురించడం, దేశాలకు ర్యాంకింగులు ఇవ్వడం పనిగా పెట్టుకున్న సంస్థ ఇది. ఈ అమెరికన్ ప్రభుత్వ సంస్థ ఇటీవల తమ నివేదికలో భారతదేశాన్ని “మతపరమైన మైనారిటీలకు ప్రమాదకరంగా ఉన్న దేశాల్లో 15వ స్థానం” అని ప్రకటించింది. దీన్నేCountries of Particular Concern (CPC)గా వ్యవహరిస్తుంది. ఈ దేశాల జాబితాలో భారత్ ముందు స్థానాల్లో బర్మా, చైనా, ఇరాక్, ఉత్తర కొరియా, పాకిస్థాన్ తదితర దేశాలున్నాయి. భారతదేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా క్రైస్తవులపై మెజారిటీ హిందువులు అకారణంగా దాడులకు పాల్పడటం, క్రెస్తవ ప్రచారానికి అడ్డుపడటం, క్రైస్తవులు ఆచారవ్యవహారాలు పాటిస్తున్నందుకు చంపేయడం, మారణహోమం సృష్టించడం, మానవహక్కులు కాలరాయడం వంటివి చేస్తున్నారనేది ఈ అమెరికన్ సంస్థ ఆరోపణ. తమ ఆరోపణలకు మద్దతుగా భాగంగా ఈ సంస్థ ప్రతియేటా వెలువరించే వార్షిక నివేదికలో, మన దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగే కొట్లాటలు, హత్య, ఊరి తగాదాలు, కుటుంబ తగాదాలను వంటి ఘటనలు ఉటంకిస్తూ, ఎక్కడైతే గాయపడ్డవారు మైనారిటీలు, నిందితులు మెజారిటీ మతస్థులుగా ఉంటారో కేవలం ఆ ఘటనలు ఉదాహరణలుగా చూపిస్తుంది.
ఇప్పుడు భారతదేశం కేంద్రంగా పనిచేస్తున్న మరొక క్రైస్తవ సంస్థ గురించి తెలుసుకుందాం.. ‘పెర్సిక్యూషన్ రిలీఫ్’ (Persecution Relief) – ఈ పేరుకు అర్ధం ‘హింస నుండి స్వాంత్వన’ చేకూర్చటం. మెజారిటీ మతస్థుల మతపరమైన హింసలో బాధితులుగా మారుతున్న దేశంలోని క్రైస్తవులకు స్వాంత్వన చేకూర్చడం ప్రధాన ఉద్దేశంగా ఈ సంస్థ పనిచేస్తున్నట్టు చెప్పుకుంటుంది.
దేశంలోని మతపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత క్రైస్తవుల కోసం పోరాటం చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ, దేశంలోని ఏ మూలన అయినా మెజారిటీ హిందువులు క్రైస్తవులపై అకారణంగా దాడులు జరిపితే వాటిని బహిర్గతం చేస్తాం, బాధితుల తరఫున పోర్టాటం చేస్తాం అని ప్రచారం చేసుకుంటుంది. దీని ప్రధానమైన పని ఏమిటంటే.. దేశంలో ఎక్కడైనా, ఏదైనా కారణం వల్ల ఇద్దరు స్నేహితుల మధ్య, ఏదైనా సమస్య కారణంగా ఊరిలోని ప్రజల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య జరిగే కొట్లాటలు, హత్యలు వంటి సంఘటనల్లో క్రైస్తవులు ఎవరైనా బాధితులుగా ఉన్నారా అనేది ముందుగా సరిచూసుకుంటుంది. ఒకవేళ దాడిలో గాయపనివారిలో క్రైస్తవులు, నిందితుల్లో హిందువులు ఉన్నట్లైతే అటువంటి ఘటనలను ఒక క్రమపద్ధతిలో పొందుపరిచి రిపోర్ట్ రూపంలోకి తీసుకొస్తుంది. చివరిగా ఆ రిపోర్ట్ అమెరికాలోని ప్రభుత్వరంగ సంస్థ అయిన USCIRFకు చేరవేస్తుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా అమెరికన్ సంస్థ భారతదేశం మీద ఆంక్షలు విధించాల్సిందిగా అమెరికా ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది.
తాజాగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ ఈ పెర్సిక్యూషన్ రిలీఫ్ అమెరికన్ క్రైస్తవ సంస్థలకు సమర్పిస్తున్న నివేదికలపై దృష్టిసారించింది. నివేదికలో పొందుపరుస్తున్న ‘క్రైస్తవులపై మతపరమైన దాడులలో నిజానిజాలు ఎంతమేరకు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేసింది.
పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తమ నివేదికలో పేర్కొన్న ఘటనల్లో నుండి బాధితులు మరణించిన 8 కేసుల మీద లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అధ్యయనం చేసింది. వాటి క్షుణ్ణంగా పరిశీలిస్తే తేలిన విషయం ఏమిటంటే.. ఆ ఎనిమిది కేసులలలో ఎలాంటి మతపరమైన అంశాలూ లేవు. కేవలం బాధితులు మాత్రం క్రైస్తవ మతానికి చెందిన వారు. దీన్ని అదనుగా చూపించి, దేశంలో క్రైస్తవుల మీద హిందువులు హింసాయుత సంఘటనలకు పాల్పడుతున్నారంటూ ఇక్కడి పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ అమెరికాలోని పలు క్రైస్తవ మిషనరీ సంస్థలతో పాటు, లాబీయింగ్ గ్రూపులకు, USCIRFకు నివేదిక పంపడం, ఇటువంటి తప్పుడు నివేదికల ఆధారాంగా భారతదేశాన్ని “మైనారిటీలకు ప్రమాదకరమైన దేశాల” జాబితాలో చేర్చడం వంటి విషయాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. తక్షణమే పెర్సిక్యూషన్ రిలీఫ్ పేర్కొంటున్న కేసుల్లోని నిజానిజాలపై దర్యాప్తు చేసి, ఆ సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.
ఒడిశాలో అనంత్ రామ్ గోండ్ అనే వ్యక్తిని పోలీసు ఇన్ఫార్మర్ అనే అనుమానంతో నక్సలైట్లు హతమార్చారు. అయితే సబ్రాంగ్ అనే వామపక్షమీడియా పోర్టల్ “రామ్ గోండ్ అనే వ్యక్తి క్రైస్తవ మతం స్వీకరించినందున తల నరికి చంపేశారు” అని ప్రచురించింది. పైగా హిందూ మతోన్మాదులే స్వయంగా నక్సలైట్లకు ఆయుధాలు అందించి ఈ హత్య చేయించారు” అని రాసింది. అంతేకాకుండా నిందితులైన హిందువులను రక్షించడం కోసం పోలీసులు ఈ హత్యలో నక్సలైట్ల పాత్రను ఖండించారని కూడా ఆ కధనంలో పేర్కొంది.
పైన పేర్కొన్న కధనమనే నిజమైతే, నక్సలైట్ చరిత్రలో వారు తమ మాజీ సహచరులలో ఒకరిని చంపడానికి హిందువుల నుంచి ఆయుధాలు తీసుకున్న మొదటి ఘటన ఇదే అవుతుంది. దీనిపై ఆసియా న్యూస్ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన పెర్సిక్యూషన్ రిలీఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షిబు థామస్.. అనంత్ రామ్ గోండ్ 9నెలల క్రితం క్రైస్తవ మతంలోకి మారాడని, రెండు నెలల క్రితం బాప్టిజం పొందాడని, దీంతో ఆ గ్రామంలో హిందువులు అతనిపై కోపంతో చంపేశారని, పైగా నక్సలైట్ల చంపేశారని చెబుతున్నారని” చెప్పాడు.
4: ఛత్తీస్‌గఢ్‌లో ముంగ్లు రామ్ నరేటి అనే వ్యక్తి హత్య
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక వృద్ధురాలిని యువకుడు హతమార్చాడు. తర్వాత నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కానీ ఈ వార్తలను పెర్సిక్యూషన్ రిలీఫ్ వక్రీకరించింది. పెర్సిక్యూషన్ రిలీఫ్ తమ 2018 వార్షక నివేదికలో ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. “హిందూ దేవాలయ పూజారి, గ్రామ సర్పంచ్ యొక్క ప్రేరణతో వృద్ధురాలు చంపబడింది” అని పేర్కొంది. ఇది పోలీసు నివేదికలకు పూర్తి విరుద్ధం.
తమిళనాడులోని గిడియాన్ అనే ఒక క్రైస్తవ పాస్టర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనను పెర్సిక్యూషన్ రిలీఫ్, ఇతర క్రైస్తవ సంస్థలు ‘క్రూరమైన హత్య’ అని వక్రీకరించాయి. తమిళ దినపత్రిక దినమలార్ దీనిని ఆత్మహత్య కేసుగా నివేదించింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇదీ ఆత్మహత్యే అని నివేదించింది. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ మాత్రం ‘మెజారిటీ మతస్థులు దారుణంగా కొట్టి, హింసించి హత్య చేశారని’ తన నివేదికలో పేర్కొంది.
పోలీసులు నేరంపై దర్యాప్తు చేయక ముందే, పెర్సిక్యూషన్ రిలీఫ్ హత్యను వక్రీకరించేందుకు అనేక రకాలుగా ప్రయత్నించింది. చివరికి ఇది ఆత్మహత్య కేసు అని స్పష్టంగా తేలింది. మృతుడు మెడకు వేసుకున్న తాడు బిగుసుకుపోయి గొంతు, మెడ చుట్టూ రక్తం గడ్డకట్టడంతో ఊపిరాడక మృతి చెందినట్టు తెలింది. కానీ అతని శరీరంపై రక్తం యొక్క ఇతర ఆనవాళ్ళు లేవు. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ తన తప్పుడు నివేదికలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించింది.
ఒడిషాలో పాస్టర్ సాన్వి హత్య ఘటనను పెర్సిక్యూషన్ రిలీఫ్ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేసింది. ఈ కేసుకు సంబంధించి తన నివేదికలో నేరం జరిగిన తేదీ, ప్రదేశం గురించి ప్రస్తావించలేదు. మరణించినవారి పేరు, ఇంటి పేరు లేకుండా నివేదిక రూపోందించారు. ఏ స్వతంత్ర వెబ్‌సైట్ లేదా న్యూస్ ఛానెల్‌లో ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ ఘటన గురించి కనీసం ప్రస్తావన కూడా లేదు. సంఘటనను ధృవీకరించే ప్రాథమిక వివరాలైన ఘటనా స్థలం, నేరం చేసిన తేదీ, మరణించిన వారి పూర్తి వివరాలు లేనప్పుడు ఇటువంటి నివేదికల ప్రామాణికతను అస్సలు ధృవీకరించలేము.
రాజస్థాన్‌లోని షరోన్ చర్చి పాస్టర్ మహేష్ తన గ్రామంలో విద్యుత్ సమస్య తలెత్తడంతో విద్యుత్ స్థంభం ఎక్కి ఫ్యూజ్ ను పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతంతో మరణించాడు. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ మాత్రం ఈ ఘటనపై తన నివేదికలో ప్రస్తావిస్తూ “పాస్టర్ మహేష్ ను కరెంట్ సమస్య పరిష్కరించడానికి విద్యుత్ స్థంబం ఎక్కమని చెప్పి, అతను పైకి వెళ్ళినప్పుడు, కొంత మంది హిందువులు ఉద్దేశపూర్వకంగా విద్యుత్తును ఆన్ చేసి, అతడు కరెంట్ షాకుతో కింద పడి చనిపోయేలా చేశారు. ఈ ఘటనపై గ్రామస్తులు సమావేశం నిర్వహించి నిందితులకు రూ.2.50 లక్షల జరిమానా విధించారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని, సర్పంచ్, ఇతరులు నిర్ణయించుకున్నారు.” అని రాసుకోచ్చింది.
లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ‘పెర్సిక్యూషన్ రిలీఫ్’ సంస్థ, తమ అధికారిక వెబ్సైట్ ని మూసివేయడం గమనార్హం.
"When guilt is in its blush of infancy, it trembles in a tenderness of shame; and the first eye that pierces through the veil that hides the secret brings it to the face"
~ Thomas SouthernePersecution Relief's site is down!! https://t.co/FRkzQvXBFZ pic.twitter.com/sqBlG4IVAX
— Legal Rights Protection Forum (@lawinforce) December 2, 2020
Source: VSK Telangana
More Stories
‘జమిలి’ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
పూర్వ క్షేత్ర సంఘచాలక్ జస్టిస్ పర్వతరావు కన్నుమూత
హిందువులపై దాడికి పాల్పడిన వారిపై చర్యకు బంగ్లా హామీ