నివన్ సాద్
గత కొన్నేళ్లుగా ‘ఎస్సీ / ఎస్టీ’, ‘ఓబీసీ’ కేటగిరీల పరిధిలో ‘దళిత క్రైస్తవులకు’ కూడా రిజర్వేషన్ కల్పించాలని పలువురు కోరుతున్నారు. క్రైస్తవ సమాజంలో కుల వ్యవస్థ లేదని (నిజం కాదు) వాదనలు ఉన్నందున రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఈ డిమాండ్లను చాలా చర్చిలు ఆమోదించనప్పటికీ, క్రైస్తవ సమాజానికి చెందిన పలువురు ఉద్యమకారులు ఎస్సీ / ఎస్టీ వర్గాలలకు లభిస్తున్న రిజర్వేషన్ ప్రయోజనాలను క్రైస్తవులకు కూడా వర్తింప చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై 2020 జనవరిలో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఈ పిటిషన్ జాతీయ దళిత్ క్రైస్తవుల మండలి (భారతదేశంలోని దళిత క్రైస్తవ సంఘ సభ్యులకు సేవలందిస్తున్న సంస్థ) దాఖలు చేసింది. ఏది ఏమయినప్పటికీ, ఆ విధంగా చేయడం వల్లన దళిత హిందువులకు రిజర్వేషన్ల ప్రయోజనాన్ని తగ్గిస్తుందని భయపడుతున్న హిందూ సంస్థలు ఆందోళన చేస్తున్నప్పటికీ ఈ డిమాండ్ పెరుగుతున్నది.
చట్టపరమైన స్థితి: రాజ్యాంగంలోని మూడవ పేరా (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్, 1950 స్పష్టంగా హిందూ, సిక్కు లేదా బౌద్ధ విశ్వాసానికి చెందిన ఎస్సీ / ఎస్టీ సమాజంలోని సభ్యులు రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందవచ్చు, అణగారిన వారిని ఆర్థికంగా ఉద్ధరించడానికి ఈ అంశం ఉద్దేశించినది.
ఎస్సీ / ఎస్టీ మూలానికి చెందిన ముస్లింలు, క్రైస్తవులు ప్రభుత్వ ఉద్యోగాలు, పాఠశాలలు, కళాశాలలలో రిజర్వేషన్ల రూపంలో ఎస్సీ / ఎస్టీలకు ఇచ్చిన ప్రయోజనాలను పొందలేరు. అంతేకాకుండా, వారిపై ఎస్సీ / ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (‘తక్కువ కులాల’ సభ్యులపై వివక్షను శిక్షార్హమైన నేరం చేస్తుంది) కింద ఎవ్వరు పోలీసు ఫిర్యాదు చేయలేరు.
భారతీయ క్రైస్తవులలో కూడా కుల వ్యవస్థ నెలకొనడం గురించి చాలా మందికి తెలియదు. వాటికన్ లేదా మరే ఇతర మత సంస్థ ఆమోదించనప్పటికీ, దీనిని ఇప్పటికీ, ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో చాలా మంది క్రైస్తవులు అనుసరిస్తున్నారు.
వారు అనుసరించే కులం వారు / వారి పూర్వీకులు క్రైస్తవ మతంలోకి మారడానికి ముందు చెందినవారు. దక్షిణ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ‘దిగువ కుల’ క్రైస్తవుల సభ్యులు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించిన అనేక ఉదంతాలు ఉన్నాయి. ప్రధానంగా క్రైస్తవులలో `తక్కువ’ కులానికి చెందిన వారు ‘ఉన్నత’ కులానికి చెందిన వారి నుండి వివక్షతను ఎదుర్కొంటున్నారు.
దళిత క్రైస్తవులను వేరుగా కూర్చోబెట్టడంతో అంటరానితనం బాధితులుగా మారిన సంఘటనలు ఉన్నాయి. ఉన్నత కులాల నుండి న్యాయవాదులలో ఒకరు, తమ గ్రామంలో ఉన్నత కులాలవారు కోసం బావులు ‘రిజర్వు’ చేయబడ్డాయని తెలిపారు. “నేను అప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎస్సీ / ఎస్టీ హోదాను మతంతో సంబంధం తెంచి వేయాలని పోరాడుతున్నాను. ఆ సమయంలో నా తల్లి స్వస్థలమైన గ్రామంలో కిరాణా దుకాణం యజమాని చేతిని నేను తాకినందున నా డబ్బును విసిరివేశాడు” అని చెప్పాడు.
అంటరానితనం యొక్క చెడు నుండి తప్పించుకోవడానికి చాలా మంది తక్కువ కులాలకు చెందిన హిందువులు తమ మతాన్ని మార్చుకుంటున్నారు. కాని వారు మతం మారినా ప్రతి మతంలోనూ అదే తీవ్రత కనబడుతుండటం చూసి బాధపడుతున్నారు. భారతీయ క్రైస్తవులలో అంటరానితనం, వివక్షత నెలకొనడం నిజంగా హృదయవిదారకమైన అంశం. చాలా మంది ఈ విషయమై వారి పట్ల సానుభూతిని చూపుతున్నారు.
అయితే వారు క్రైస్తవ మతంలోకి మారినప్పటి నుండి వారికి రిజర్వేషన్లు కొనసాగించడంలో అర్ధం లేదు. ఎందుకంటే వారికి వివక్ష లేని వాతావరణం వాగ్దానం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దక్షిణ, పశ్చిమ భారతదేశం, క్రైస్తవ మిషనరీలు గ్రామాల్లోని కుల హిందువులను ‘వేటాడటం’ అని పిలుస్తున్నారు. తమ సమాజంలో ‘వివక్షకు చోటు లేదు’ అని పేర్కొంటూ వారిని క్రైస్తవ మతంలోకి రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ తప్పుడు వాగ్దానాన్ని గమనించిన తరువాత వారిని తిరిగి హిందూ మతంలోకి మార్చడాన్ని ఎవరూ ఆపలేరు. అయినప్పటికీ వారు తాము మతం మారినా రిజర్వేషన్లు కొనసాగించా
చర్చి, మసీదుల మాదిరిగా కాకుండా, దేవాలయాలు అందుకున్న చాలా విరాళాలను ప్రభుత్వం ‘పన్ను’ గా తీసుకుంటుంది ; క్రైస్తవులు, ముస్లింలు తమ మతంలోని అణగారిన దళితులను ఉద్ధరించడానికి కొంత డబ్బు ఖర్చు చేయగలరు, హిందూ దేవాలయాల ఆర్థిక శక్తిని సామర్ధ్యాన్ని విచ్ఛిన్నంకావడంతో దళిత హిందువులు తమ అభ్యున్నతి కోసం ప్రభుత్వంపై పూర్తిగా ఆధారపడుతున్నారు.
హిందూ దళితులను మతం మార్చకుండా ఉంచే ఏకైక అంశం, వారు తమ రిజర్వేషన్ల ప్రయోజనాలను నిలుపుకోవడం; రిజర్వేషన్లు సార్వత్రికమైతే, మతమార్పిడి కోసం మిషనరీలు ఇచ్చే భౌతికపరమైన ఆకర్షణలు అంగీకరించడానికి వారే
క్రైస్తవుల కోసం ఈ వర్గాన్ని విస్తరిస్తే, ఎస్సీ / ఎస్టీ సమాజంలోని సభ్యులకు ఉద్యోగాలు, విద్యా సంస్థలలో తక్కువ సీట్ల కోసం ఎక్కువ పోటీ ఉండవచ్చు. రిజర్వేషన్ విధానంలో దళిత క్రైస్తవులను చేర్చడం వల్ల దళిత హిందువులకు తక్కువ సంఖ్యలో కేటాయించిన సీట్ల కోసం లక్షలాది మంది కొత్త ప్రజలు పోటీ పడతయారు. దానితో ఇప్పటికే పేదలుగా ఉన్న దళిత హిందువులు ఆర్థిక నిచ్చెన పైకి ఎక్కడం కష్టతరం అవుతుంది.
దిగువ వర్గాలకు చెందిన వారు ఎదుర్కొంటున్న వివక్షకు పరిహారం చెల్లించేలా చూడటానికి, సామాజికంగా, ఆర్థికం
అయితే, ఇది సార్వత్రిక సమస్య అని తెలుసుకున్న తర్వాత వారు ఎందుకు హిందూ మతంలోకి తిరిగి మారడంలేదు? హిందూగా మిగిలి ఉండటానికి, వారి విశ్వాసాన్ని విదేశీ మతాలకు మార్చకుండా ఉండటానికి ప్రజలకు కనీసం కొంచెం ప్రోత్సాహం ఇవ్వవలసిన సమయం నేడు ఆసన్నమైనది గుర్తించాలి.
భారతీయ చరిత్రలో దళిత హిందువులు అత్యంత వివక్షకు గురయ్యారు. వారి అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎస్సీ / ఎస్టీ వర్గానికి ఇతర విశ్వాసాల ప్రజలను చేర్చడం వల్ల ఈ సమాజంలోని సభ్యుల కోసం తక్కువ సీట్ల కోసం అధిక పోటీ ఏర్పడుతుంది.
సంస్థలలో పోటీ పెరిగి వారికి అందించే ప్రయోజనాలను తగ్గించవచ్చు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వారికి కూడా వారి పేదరికం ఆందోళన కలిగించిన అంశం కాబట్టి, దళిత హిందువులు ఆర్థికంగా స్థిరపడే వరకు ఇటువంటి డిమాండ్లను పరిగణించరాదు.
(ఓపిఇండియా నుండి)
More Stories
కోల్‌కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!
రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్‌తో ప్లాన్… ఐఎస్ కుట్ర!
కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి చిచ్చు