నాగార్జునసాగర్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో నోములు ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో దవాఖానకు తరలించారు. కాగా, ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో మృతి చెందారు.
1956 జనవరి 9న నల్గొండ జిల్లా పాలెంలో నోముల నర్సింహయ్య జన్మించారు. 1999,2004లో సిపిఎం నుంచి రెండు సార్లు ఎంఎల్ఎగా ఎన్నికైయ్యారు. 2013లో టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి ఎంఎల్ఎగా గెలిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, నాయకులు సంతాపం ప్రకటించారు.
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా నోముల నిలిచిపోతారని చెప్పారు. నోముల మరణం టీఆర్‌ఎస్ పార్టీకి, నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు తీరనిలోటని పేర్కొన్నారు.

More Stories
కేంద్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుడు ఆరోపణలు
గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన శివప్రతాప్ శుక్లా
దానం, కడియంలకు స్పీకర్ క్లీన్చిట్.. మండిపడ్డ ప్రతిపక్షాలు