బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్నేతలు దాడి చేశారు. కాన్వాయ్‌లోని కారును అడ్డుకుని అద్దాలు పగలగొట్టారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో జరిగిన ఈ ఘటన కలకలం రేకెత్తించింది.
సోమవారం హైదరాబాద్‌లో పలు ఆలయాలను సందర్శించిన బండి సంజయ్.. సాయంత్రం నెక్లెస్ రోడ్ కు వెళ్లారు. వాకింగ్ చేసి.. అక్కడున్న పిల్లలతో సరదాగా ఆటలు ఆడారు. తర్వాత నెక్లెస్‌రోడ్డు నుంచి బయలుదేరారు. అప్పటికే నెక్లెస్‌రోడ్డుకు వచ్చిన టీఆర్ఎస్ ఖైరతాబాద్ అభ్యర్థి విజయారెడ్డి, ఆమె అనుచరులు సంజయ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
సంజయ్ ఉన్నట్టుగా భావిస్తూ ఓ కారుపై దాడికి దిగారు. అద్దాలు ధ్వంసం చేశారు. కారులో ఉన్నవారిని బయటికి లాగే ప్రయత్నం చేశారు. ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులనూ తోసేశారు. బీజేపీ శ్రేణులు ప్రతిఘటించాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కానీ ఆ కాన్వాయ్‌లో సంజయ్ ఉన్న కారు అప్పటికే ముందుకు వెళ్లిపోయింది.
చివరికి పోలీసులు విజయారెడ్డిని, టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు పేర్కొన్నారు. బండి సంజయ్ కారులో వెళ్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు మరో కారును అడ్డుపెట్టి దాడికి ప్రయత్నం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఉద్దేశపూర్వకంగానే తనపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారని బండి సంజయ్ పేర్కొన్నారు ఈ దాడికి సంబంధించి.. విజయారెడ్డి, ఆమె అనుచరులపై రాంగోపాల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటమి భయంతో అధికార పక్షం అసహనంతో ఇటువంటి దాడులకు దిగుతున్నట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే బిజెపి కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించి, శాంతియుతంగా ఉండలని ఆయన కోరారు.
గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని విచ్చల విడిగా డబ్బు, మద్యాన్ని పంచుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. అడుగడుగునా అడ్డుపడుతున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురులు డీకే అరుణ ఆరోపించారు. టీఆర్ఎస్ రౌడీలు, ఎంఐఎం గుండాలు సంజయ్ పై దాడికి ప్రయత్నాలు చేశారని ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె వ్యక్తం చేశారు.
More Stories
తెలంగాణలో ఏపీ క్యాడర్ అధికారుకు ఏపీ వెళ్లాలని ఆదేశం
రతన్ టాటా మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం
వర్గీకరణకు కమిషన్ పేరుతో ఉద్యోగ భర్తీకి ఎగనామం!