బీజేపీ మేయర్ కావాలో, మతతత్వ ఎంఐఎం మేయర్ కావాలో!   

అభివృద్ధి చేసే బీజేపీ మేయర్ కావాలో లేక మతతత్వ ఎంఐఎం మేయర్ కావాలో ప్రజలు ఆలోచించాలని  జీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఓఎన్‌జీసీ స్వతంత్ర డైరెక్టర్ సంబిత్ పాత్ర గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన హైదరాబాద్‌ను భాగ్యనగర్ అంటే యువరాజ్ కేటీఆర్ నారాజయ్యారని ఎద్దేవా చేశారు. 
 
తాను మాత్రం భాగ్యనగర్ అని గర్వంగా చెబుతానని స్పష్టం చేస్తూ  తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ మరియు కేసీఆర్ దోస్త్ సర్కార్ నడుస్తోందని ధ్వజమెత్తారు.  ‘మేం జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోరాడుతున్నాం. టీఆర్ఎస్ వాళ్లు మాత్రం ఎఫ్ఎఫ్ఎంసి ప్రైవేట్ లిమిటెడ్ మున్సిపల్ (ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్) ఎన్నికల్లో పోరాడుతున్నారు’అని తెలిపారు.
 
కాంగ్రెస్‌కి ఓటేస్తే టీఆర్ఎస్‌కి వేసినట్లే. టీఆర్ఎస్‌కి ఓటేస్తే ఎంఐఎంకి వేసినట్లే అని చెప్పారు.  ఎంఐఎంతో పొత్తులేకపోతే తెలంగాణలో 17 ఎంపీ సీట్లుంటే  కారు సారూ 16 అని ఎందుకు అన్నాడని ప్రశ్నించారు. కార్ పంచర్ అయింది సార్ అనిపేర్కొన్నారు . ఫార్మ్ హౌస్‌లో కూర్చొని ఎగ్జిట్ పోల్ చేస్తే 16 ఎంపీ సీట్ల సంఖ్య 9కి తగ్గిందని గుర్తు చేశారు. 
 
బీహార్‌లో కూడా వర్క్ ఫ్రం హోం ఎగ్జిట్ పోల్ చేశారు. అందుకే ఫెయిల్ అయింది. భారత్ మాతాకు జై, హిందూస్తాన్, భారత్ అనే పదాలు అనను అనే ఎంఐఎంని ఓడించాలని స్పష్టం చేశారు. ఓవైసీ ఒక నయా జిన్నా అని మండిపడ్డారు. 
 
భాగ్యనగర్ గడ్డ మీది నుంచి అడుగుతున్న మోదీని ప్రధానిగా గుర్తిస్తావా లేదా? ఓవైసీ స్పష్టం చేయాలి. కేటీఆర్ మా అనుమతి లేకుండా ఓల్డ్ సిటీకి ఎలా వచ్చాడని ఎంఐఎం అడుగుతుంది. ఓల్డ్ సిటీకి రావాలంటే వీసా తీసుకొని రావాలా?  అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇక్కడ ఓవైసీ సీఎం అని ఎంఐఎం నేతలు అంటున్నారని ఎద్దేవా చేశారు. పాత బస్తీ మాదే, న్యూ బస్తీ మాదే. హైదరాబాద్‌లో అకాల వర్షాల వల్ల 80 మంది మరణించారు. దీనికి ఎవరిది బాధ్యత? అని ప్రశ్నించారు. వరద బాధితులకు రూ 10 వేల సాయం ఇవ్వకుండా జేబులో వేసుకున్నారని ధ్వజమెత్తారు. వరదసాయంలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు.