
జర్నలిజం అంటే సెన్సేషనలిజం కాదని సమాజానికి తీర్చిదిద్దేందుకు ఉపయోగపడే సాధనమని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) ఐఐఎంసీలో 2020-21 విద్యా సంవత్సరాన్ని వర్చూవల్ సమావేశం ద్వారా ఆయన ప్రారంభించారు.
‘‘టీఆర్‌పీల కోసం, సెన్సేషనలిజం కోసం జర్నలిజం పక్కదారి పడుతోంది. జర్నలిజం అంటే బాధ్యతాయుతమైన వృత్తి. ఇది ప్రజలను పక్కదారి పట్టించే సాధనం కాదు. టీఆర్‌పీల కేంద్రంగా నడిచే జర్నలిజం వైపు మీరు ఆకర్షితులు కాకూడదు” అంటూ ఈ సందర్భంగా జర్నలిజం విద్యార్థులకు హితవు చెప్పారు.
ఏదైనా మంచి జరిగితే అది కూడా వార్తే కదా. మంచి వార్తల్ని, కథనాల్ని ఎంచుకుని ప్రజలకు అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపైనే ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛకు పత్రికా స్వేచ్ఛకు విలువ ఉంది. అయితే దానిపై ఎంతో బాధ్యత కూడా ఉందని పేర్కొన్నారు. ఈ రెండు విషయాలను అర్థం చేసుకోవాలని సూచించారు.
“మీరిచ్చే మంచి కథనాల వల్ల సమాజం మంచి దారిలో ప్రయాణించాలి’’ అని చెప్పార.. ‘‘టెలివిజన్ విక్షణలను లెక్కించడం కోసం 50 వేల ఇళ్ల వద్ద ప్రత్యేక మీటర్లు ఏర్పాటు చేశాం. నిజానికి టీవీ చూసేవారు 22 కోట్ల మంది ఉన్నారు. కానీ, అందరి నుంచి అభిప్రాయాలు తీసుకోవడం కష్టమని పెక్రోన్నారు.
అయితే ప్రజలు ఏం కోరుకుంటున్నారనేదాన్ని మాత్రం అంచనా వేయగలమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇక జర్నలిజం విషయానికి వస్తే.. వాస్తవాలపైనే కథనాలు రాయడం అవసరమని తెలిపారు. సెన్సేషనల్ కోసం కథలను, వార్తలను రాయాల్సిన అవసరం లేదని జవదేకర్ స్పష్టం చేసారు. మన సమాజంలో చాలా మంచి కథనాలు, వార్తలు ఉన్నాయి. కానీ ఏ మీడియాకు వీటిని ప్రసారం చేసే సమయం లేదని కేంద్ర మంత్రి విచారం వ్యక్తం చేశారు.
More Stories
చంద్రయాన్-5 మిషన్కు కేంద్రం ఆమోదం
‘రైసినా డైలాగ్’ సదస్సు రేపే ప్రారంభం
వియత్నాంపై రాహుల్ కు అంత ప్రేమ ఎందుకో?