అదానీకి  విశాఖలో130 ఏకరాలు కేటాయింపు 

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అదానీ కంపెనీకి సూపర్ బొనాంజా అందించింది. విశాఖపట్నంలోని మదురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్‌కు రాష్ట్ర ప్రభుత్వం130 ఎకరాల భూమిని కేటాయించింది. మూడేండ్లలో డాటాసెంటర్‌ పార్క్‌, ఐటీ బిజినెస్‌ పార్క్‌, స్కిల్‌ యూనివర్సిటీ, రిక్రియేషన్‌ సెంటర్‌లను ఏర్పాటు చేయాల్సి ఉందని ప్రభుత్వం షరతు విధించింది. 

అదానీ కంపెనీకి పలు ఇతర ప్రోత్సాహకాలను కూడా కల్పిస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత 20 ఏండ్ల పాటు విద్యుత్‌ రాయితీలు అందిస్తారు. భూమి అప్పగించిన నాటి నుంచి ఏడేండ్ల పాటు ఎస్‌జీఎ్‌సటీ వందశాతం రాయితీ కల్పించారు. 

రాష్ట్రంలో మరో చోట ఎక్కడైనా ఈ కంపెనీ తన సొంత స్థలంలో 600మెగావాట్ల సామర్థ్యం ఉన్న పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటుచేస్తుంది.