
తన బాల్యంలో భారత దేశ ఇతిహాసాలైన రామాయణ, మహాభారత కావ్యాలలో కధలు వింటూ పెరిగానని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వెల్లడించారు. ఒబామా కొత్తగా రాసిన ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకం తొలి సంపుటి ఇటీవల రిలీజైంది.
దాంట్లో భారత్ గురించి ఆయన కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు వెలుబుచ్చారు. ఇండోనేషియాలో తన చిన్నతనం గడిచిందని, ఆ సమయంలో హిందూ కావ్యాలు అయిన రామయణం, మహాభారతంలో ఉన్న కథలను విన్నట్లు బరాక్ ఒబామా తెలిపారు.
భారత్ అతిపెద్ద దేశమని, ఆరోవంతు ప్రపంచ జనాభా అక్కడే ఉన్నదని, ఆ దేశంలో సుమారు రెండు వేల స్థానిక తెగలు ఉన్నాయని, అక్కడ సుమారు ఏడు వందలకుపైగా భాషలు మాట్లాడుతుంటారని ఒబామా తన పుస్తకంలో రాశారు.
వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేంత వరకు ఆయన భారత్ ను సందర్సించలేదు. 2010లో ఒబామా భారత్‌లో పర్యటించారు. కానీ తన ఊహాల్లో మాత్రం భారత్ కు ప్రత్యేక స్థానం కల్పించినట్లు ఆయన వెల్లడించారు.
ఇండోనేషియాలో తన బాల్యం గడిచిందని, ఆ సమయంలో రామయణ, మహాభారత కథలు విన్నానని, తూర్పు దేశాల మతాలపై ఆసక్తి వల్ల అలా జరిగి ఉంటుందని, పాక్-భారత్ కు చెందిన మిత్రులు తనకు పప్పు, కీమా వండడం నేర్పించారని, బాలీవుడ్ సినిమాలకు కూడా అలవాటు అయ్యేలా చేశారని ఒబామా తన పుస్తకంలో వెల్లడించారు.
ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకాన్ని రెండు భాగాల్లో ఒబామా రిలీజ్ చేయనున్నారు. తొలి పుస్తకంలో 2008 ఎన్నికల ప్రచారం నుంచి తొలి టర్మ్ పూర్తి అయ్యే వరకు జరిగిన కొన్ని ఆసక్తి అంశాలను ఆ పుస్తకంలో రాయనున్నారు.
పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో ఒబామా బిన్ లాడెన్‌ను చంపిన ఘటనకు సంబంధించి డేరింగ్ ఆపరేషన్ గురించి దాంట్లో వివరించనున్నారు. మంగళవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకం బుక్‌స్టోర్స్‌లో అందుబాటులోకి వస్తున్నది.
More Stories
అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా టీమిండియా
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడిచేసింది వీరే!
వచ్చే జనవరిలోనే పాకిస్థాన్ సాధారణ ఎన్నికలు