ల‌వ్ జిహాద్‌కు పాల్ప‌డితే ఐదేళ్లు జైలు 

ల‌వ్ జిహాద్‌కు పాల్ప‌డితే ఐదేళ్లు జైలు 

 ల‌వ్ జిహాద్‌కు పాల్ప‌డిన‌వారికి 5 ఏళ్ల పాటు క‌ఠిన శిక్ష అమ‌లు చేసే విధింగా చ‌ట్టాన్ని త‌యారు చేస్తున్న‌ట్లుమధ్య ప్రదేశ్  హోంశాఖ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ చ‌ట్టాన్ని తీసుకురానున్న‌ట్లు ఆయ‌న ప్రకటించారు.

క‌ర్నాట‌క ప్ర‌భుత్వం కూడా ల‌వ్ జిహాద్‌కు వ్య‌తిరేకంగా క‌ఠ‌న చ‌ట్టాన్ని రూపొందించాల‌ని భావిస్తున్న‌ది. హ‌ర్యానా రాష్ట్రం కూడా క‌ఠిన చ‌ట్టం చేసేందుకు సిద్ద‌మైంది. అయితే ల‌వ్ జిహాద్‌పై చ‌ట్టానికి సంబంధించిన బిల్లును రాబోయే అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంమంత్రి వెల్లడించారు.

ఆ బిల్లులో 5 ఏళ్ల శిక్ష గురించి ప్ర‌స్తావించ‌నున్నారు.  ప్రేమ పేరుతో మ‌తాంత‌ర వివాహాలు జ‌రుగుతున్నాయ‌ని,  హిందూ మ‌తానికి చెందిన అమ్మాయిల‌ను.. ముస్లింలు అక్ర‌మ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేసుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో.. ల‌వ్ జిహాద్‌కు వ్య‌తిరేకంగా ప‌లు రాష్ట్రాలు చ‌ట్టాలు చేసేందుకు సంసిద్ధం అయ్యాయి.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఫ్రీడ‌మ్ ఆఫ్ రిలీజియన్ బిల్లును అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా తెలిపారు.  ల‌వ్ జిహాద్ లాంటి నేరాల‌ను నాన్ బెయిల‌బుల్‌గా ప్ర‌క‌టించాల‌ని కూడా ఆ బిల్లులో పొందుప‌ర‌చ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు.