బెంగళూరు నగరంలోని డీజేహల్లిలో జరిగిన అల్లర్ల కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మేయరు సంపత్ రాజ్ ను కేంద్ర క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు సంపత్ రాజ్ సహా 60 మందిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ సమర్పించారు.
డీజేహల్లి అల్లర్లలో నిందితులైన కాంగ్రెస్ నాయకులు సంపత్ రాజ్, జాకీర్ లపై అంతకుముందు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. కొవిడ్ సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన సంపత్ రాజ్ డిశ్చార్జ్ అయ్యాక పరారీలో ఉన్నారు.
దీంతో తమ ముందు హాజరుకావాలని క్రైంబ్రాంచ్ సంపత్ రాజ్ నివాసానికి నోటీసు అతికించారు.రెండు సార్లు కార్పొరేటరు అయిన సంపత్ బెంగళూరుకు మేయరుగా పనిచేశారు. సంపత్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు.
More Stories
14 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల తేదీల్లో మార్పు
అస్సాంలో ముసాయిదా ఎన్ఆర్ సిని పునఃపరిశీలించాలి
వీధి కుక్కలకు బిస్కెట్లు వేసి ఉగ్రవాదిని హతమార్చారు