జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్టేకు నిరాకరణ 

జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్టేకు నిరాకరణ 
జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే విచారణ జరిపేందుకు తమకు అభ్యంతరం లేదని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. 
 
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఆపాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శ్రవణ్‌ పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ అభ్యర్థనతో న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. 
 
రాజకీయంగా వెనుకబడిన బీసీలను, గుర్తించే ప్రక్రియ లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎంబీసీలపై ప్రేమ ఉంటే పదేళ్ల నుంచి ఎందుకు స్పందించలేదనని కోర్టు ప్రశ్నించింది. 
 
ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వబోయే సమయంలోఎందుకు గుర్తొచ్చిందని, రాజకీయ దురుద్దేశంతోనే పిల్‌ దాఖలు చేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2015, 2016లో దాఖలైన పిటిషన్లను జత చేయాలని రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది.