కరణ్ భాసిన్
ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి లక్షలాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున గత కొన్ని వారాలుగా మనం రెండు ఎన్నికలను ఆసక్తిగా గమనించాము. బీహార్‌లో నిర్వహించిన ఎన్నికలతో పాటు పలు ఇతర రాష్ట్ర అసెంబ్లీ ఉప ఎన్నికలు ఉగ్రమైన మహమ్మారి మధ్యలో నిర్వహించాల్సి వచ్చిన అతి పెద్ద కసరత్తుగా చెప్పవచ్చు.
ఏదేమైనా ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న సంక్లిష్టతను బట్టి ఈ కృషిని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జిట్ పోల్స్ మరోమారు తారుమారు కావడం జరిగింది. వాస్తవానికి, మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత బీహార్ లో మారో మారు ఎన్నిక కావడం కషమైన అంశమే.
పైగా, గణనీయమైన ఆర్ధిక విపత్తుకు కారణమైన మహమ్మారి మధ్యలో ఎన్నికలు జరిగినప్పుడు తిరిగి ఎన్నిక కావడం దాదాపు అసంభవమే కాగలదు.
ఎన్నికలలో ఓడిపోవడానికి ఎన్డీఏ సిద్ధంగా ఉన్నట్లు, మహాఘటబంధన్ విజయం సాధించబోతున్నట్లు సాంప్రదాయక అంచనాలు వేశారు. ఈ అంచనాలను పూర్తిగా తప్పని నవంబర్ 11 నాటి ఫలితాలు నిరూపించాయి.
అయితే ఎన్నికల ఫలితాల పట్ల చాలామంది ఆశ్చర్యపోతున్నారు రాజకీయ విశ్లేషకులు, తరచూ రాజకీయ స్వభావం గల వివరణల కోసం వెతుకుతారు. అందువల్ల వారు ఆర్జెడికి కాంగ్రెస్ ముప్పుగా మారడం, ఆర్జెడి-కాంగ్రెస్-వామపక్ష కూటమికి చెందిన మైనారిటీ ఓటు బ్యాంకులోకి ఏఐఎంఐఎం ముంచెత్తడం వంటి వాదనలతో సరిపుచ్చుకొంటున్నారు.
ఏదేమైనా, ఈ వాదనలు ఎన్డిఎకు అనుకూలంగా ఉన్న ప్రజా తీర్పును వివరించడంలో విఫలమవుతున్నాయి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు రాష్ట్రం అంతటా వ్యాపించి ఉండాలి. కానీ కొన్ని ప్రాంతాలకు పరిమితం కాలేవు.
కొంత మేరకు ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్, అభిప్రాయ సేకరణలలో వెల్లడైనప్పటికీ ఎన్నికల ఫలితాలలో, ముఖ్యంగా చివరి రెండు దశాలలలో ఎందుకు వెల్లడి కాలేదో ముఖ్యంగా లోతుగా అధ్యయనం చేయవలసి ఉంది.
అందుకు ప్రత్యామ్నాయ వివరణలు ఉన్నాయి. కేవలం బీహార్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలలో ఎన్డీఏ బలమైన పనితీరు ప్రదర్శించడం గమనించాలి. ఎన్నికల ప్రవర్తనకు సంబంధించి కుల సమీకరణాలు బద్దలు కావడాన్ని ఈ ఎన్నికలలో కనిపించిన మొదటి అంశంగా భావించవచ్చు.
కుల సమీకరణాలు ఎన్నికల ఫలితాలపై చూపుతున్న ప్రభావం తగ్గిపోతున్నట్లు వరుసగా జరుగుతున్న పలు ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఓటర్ల ప్రవర్తనలో ప్రారంభమైన ముఖ్యమైన మార్పుగా ఇది కనిపిస్తున్నది. ఈ ధోరణి మన దేశ రాజకీయ ప్రక్రియకు బాగా ఉపయోగపడుతుంది.
ప్రశ్న ఏమిటంటే, కులం పట్టించుకోకపోతే ఏమి చేస్తుంది?
దానికి సమాధానం సంక్షేమం, ప్రజా వస్తువుల పంపిణీ.
2019 తరువాత వచ్చిన తీర్పు ఫలితంగా ఎన్నికల ఫలితం సంక్షేమ బట్వాడా ఫలితమా అనే దానిపై కఠినమైన అధ్యయనం జరిగింది. సంక్షేమ వాదన ఒక మహమ్మారి మధ్యలో మరింత అర్ధవంతమనే అంశాన్ని గ్రామీణ ప్రాంతాలు ప్రతిపక్షానికి అనుకూలంగా ఓటు వేస్తాయని ఊహించిన చాలా మంది రాజకీయ విశ్లేషకులు విస్మరించారు.
అందుకు బలమైన ఆర్థిక కారణాలు కూడా ఉన్నట్లు అనిపిస్తున్నది. లాక్ డౌన్ సమయంలో కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతూ ఉండడంతో గ్రామీణ ప్రాంతాలలో కార్యకలాపాలు స్థంభించిపోవడం చాల పరిమితంగా జరిగింది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొన్ని అంతరాయాలు ఉన్నప్పటికీ ప్రతికూల ఆర్థిక ప్రభావాన్ని చూపించ గలిగేటంతటి ముఖ్యమైనవి కావు. మొదటి త్రైమాసికంలో మన మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదించబడినప్పటికీ, మొదటి త్రైమాసికంలో మునుపటి సంవత్సరంలోని 3 శాతంతో పోలిస్తే ప్రాథమిక రంగం 3.4 శాతం వై-ఓ-వై వద్ద విస్తరించడానికి ఇది ఒక కారణం.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక ఒత్తిడి లేకపోవడాన్ని ఇది సూచిస్తుంది. పట్టణాల నుండి గ్రామీణ ప్రాంతాలకు లాక్ డౌన్ సమయంలో జరిగిన వలసల స్థాయి మాత్రమే ఆందోళన కలిగిస్తుంది.
ఏదేమైనా, పెరిగిన ఎంజిఎన్ఆర్ఇజిఎ వ్యయంతో, వేతనాల పెంపు, అదే సమయంలో ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ పథకం కింద నగదు బదిలీ కార్యక్రమం షాక్‌లో కొంత భాగాన్ని భర్తీ చేయడానికి కీలకంగా మారింది. .
గ్రామీణ ప్రాంతాల్లో రూ .500 నగదు బదిలీ జరగడం చాలా ప్రభావం చూపింది. అదే సమయంలో ఆహార భద్రత చట్టం క్రింద ఆహార ధాన్యాల పంపిణీని గణనీయంగా విస్తరించడం జరిగింది.
పర్యవసానంగా, మహమ్మారి కారణంగా కనిపించే ఆర్థిక ఒత్తిడి లేనప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల గణనీయంగా కనిపించింది.
ఇదే విధంగా ఆర్ధిక వ్యవస్థ పునరుద్ధరణలో గ్రామీణ ప్రాంతాల నుండి డిమాండ్ పెరగడం గణనీయ ప్రభావం చూపుతూ వచ్చింది. రికార్డు స్థాయిలో ట్రాక్టర్ అమ్మకాలు పెరగడం లేదా రెండవ త్రైమాసికంలో ఎఫ్ఎంసిజి కంపెనీల అమ్మకాల బలమైన వృద్ధిని సాధించడం అందుకు నిదర్శనం.
బీహార్ రాష్ట్రం ప్రధానంగా గ్రామీణ ప్రాంతం కావడాన్ని ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశం. ఇటీవలి వ్యవసాయ సంస్కరణలు మద్దతు ధరల పెంపుకు దారితీశాయి. వాటి ఫలితంగా వెంటనే ధరలు ఎక్కువగా గిట్టుబాటు కావడం సహితం బీహార్ లోని ఓటర్లపై ప్రభావం చూపించిందని చెప్పవచ్చు.
బీహార్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించడానికి మరింత వివరణాత్మక ఎన్నికల డేటా కోసం మనం ఎదురుచూస్తున్నప్పుడు, ఆర్థిక వ్యవస్థలో సేవలేతర భాగం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నట్లు కనిపిస్తాయి. కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల మొత్తం మీద ప్రజలలో సంతృప్తి కనిపిస్తుంది.
అటువంటి పనితీరుకు కారణమైన ముఖ్య కారణం గ్రామీణ రంగం బాగా పని చేయడమే. ఇదే మెరుగైన రాజకీయ ఫలితాలను ఇస్తున్నది. సౌభాగ్య, పిఎం ఆవాస్, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి కార్యక్రమాలు గతంలో రాజకీయ డివిడెండ్లకు కారణమైన విధంగానే ఇప్పుడు కూడా ఈ చర్యలు ఆశ్చర్యం కలిగించకూడదు.
ప్రజా వ్యయం యొక్కగరిష్ట ప్రభావం చూపే సుపరిపాలన విధానాల వైపు ఇప్పుడు మనం కదులు తున్నందున రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా, ఇప్పుడు అందరు తమ, తమ ఆర్థిక, సంక్షేమ విధానాలపై పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.
More Stories
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?