డిసెంబర్ లో 100 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ల పంపిణీ

ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సీరమ్ సంస్థ ఆస్ట్రాజెనికా పేరుతో కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి  100 మిలియన్ల వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ సీఈఓ ఆధార్‌ పూనావాలా ప్రకటించారు.

ప్రస్తుతం ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వాలంటీర్లపై చేస్తున్న ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని, ఆ ట్రయల్స్ సక్సెస్ అయితే అత్యవసరం  పరిస్థితుల దృష్ట్యా వన్ మిలియన్ కరోనా వ్యాక్సిన్లను అందుబాటులో తెస్తామని తెలిపారు.

2021 ప్రారంభంలో కరోనా వ్యాక్సిన్ అప్రూవల్ అయితే 50–50 బేసిక్ ప్రకారం సౌత్ ఏషియన్ కంట్రీస్ తో పాటు కరోనా వ్యాక్సిన్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన డబ్ల్యూహెచ్ఓ కు తాము సీరమ్ ఇండియా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ను అందిస్తామని హామీ ఇచ్చారు.

కాగా సీరమ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న మరో 5 ఫార్మా కంపెనీలతో ఒప్పొందం కుదుర్చుకుంది. ఈ ఒప్పొందం ప్రకారం 40మిలియన్ల నోవావ్యాక్సిన్లను తయారు చేసేలా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు  సీరమ్ సీఈఓ చెప్పారు.

ఆస్ట్రాజెనికా, నోవావ్యాక్సిన్లను తయారు చేయడం కష్టమని భావించామని, కానీ ఆ రెండు వ్యాక్సిన్లు మంచి ఫలితాలను ఇస్తున్నట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆధార్‌ పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు.