రాహుల్ గాంధీలో అభిరుచి, ఆస‌క్తి లేదు

అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా తాజాగా త‌న రాజ‌కీయ జీవిత స్మృతుల‌కు సంబంధించి ఓ పుస్త‌కాన్ని రాశారు.  ఎ ప్రామిస్డ్ ల్యాండ్ పేరుతో రిలీజైన తొలి పుస్త‌కంలో .. ఒబామా అనేక మంది రాజ‌కీయ నేత‌ల గురించి చ‌ర్చించారు.

భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి కూడా ఒబామా త‌న పుస్త‌కంలో కొన్ని వ్యాఖ్య‌లు రాశారు. అమెరికా మాజీ ర‌క్ష‌ణ మంత్రి బాబ్ గేట్స్‌, మాజీ భార‌త ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ గురించి కామెంట్ చేశారు. 

వారిద్ద‌రి మ‌ధ్య చాలా సామ‌రస్య‌పూర్వ‌క సంవాదం జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించారు. అయితే ఇద్దరూ ఒకేరకమైన అస్పష్టమైన సమగ్రతను కలిగి ఉన్నారని  పేర్కొన్నారు.

అయితే ఆ పుస్త‌కంలోనే రాహుల్ గాంధీ గురించి పేర్కొంటూ  రాహుల్ గాంధీలో అభిరుచి, ఆస‌క్తి లోపించిన‌ట్లు ఒబామా అభిప్రాయ‌ప‌డ్డారు. హోంవ‌ర్క్ చేసిన విద్యార్థి ఎలా అయితే టీచ‌ర్‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తారో అలా రాహుల్ చేష్ట‌లు ఉన్న‌ట్లు ఒబామా త‌న వ్యాసంలో రాశారు.  

 ‘రాహుల్ గాంధీ కొంచెం నిరుత్సాహంగా కనిపిస్తారు. తన నైపుణ్యంపై ఆయన కొంత నెర్వస్‌గా ఉంటారు. పని పూర్తి చేసి టీచర్ మెప్పు పొందాలని ఒక విద్యార్థి ఎలా ఆరాటపడతారో రాహుల్ అలా కనిపిస్తారు. అయితే ప్రావీణ్యం సంపాదించాలనే తపన మాత్రం రాహుల్‌‌లో లేదు. ఆయనలో స్పష్టత, ధైర్యం కొరవడ్డాయి’ అని ది ప్రామిస్డ్ ల్యాండ్ అనే సదరు పుస్తకంలో ఒబామా రాసుకొచ్చారు.   

హుల్‌ గాంధీ ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, ఆయనకు తెలియని గుణం ఆయనలో దాగి ఉందని, ఆయన ఏదైనా నేర్చుకోవాలనే ఉత్సుకతతో ఉంటారని, కానీ లోతుగా ఏదైనా అధ్యయనం చేయాల్సి వస్తే ఒత్తిడి లోనవుతారని, ఇదే ఆయన బలహీనత అని ఒబామా పుస్తకంలో పేర్కొన్నట్లు తెలిపింది.

అమెరికా అధ్య‌క్షుడిగా ఒబామా ఉన్న స‌మ‌యంలో  రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడిగా ఉన్నారు. 2017 డిసెంబ‌ర్‌లో భారత్ కు వ‌చ్చిన ఒబామాను రాహుల్ క‌లుసుకున్నారు. రాహుల్‌పై ఒబామా చేసిన కామెంట్‌లో అస‌త్యం ఏమీలేద‌ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌ ఎద్దేవా చేశారు.  

రాహుల్ మేధస్సు గురించి మ‌నం పెద్ద‌గా చ‌ర్చించాల్సిన అవ‌స‌రం లేద‌ని,  ఒబామా లాంటి మేటి వ్య‌క్తి రాహుల్ గురించి అలా కామెంట్ చేస్తే, మ‌నం దాని గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి పేర్కొన్నారు.  

రెండు సంపుటాలుగా రానున్న ఈ పుస్తకం ఈ నెల 17న అందుబాటులోకి రానుంది. 2009లో అమెరికా అధ్యక్షుడుగా ఒబామా ఎన్నికైన సమయంలో…భారత్‌లో యుపిఎ ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా వ్వహరిస్తున్నారు. ఈ పుస్తకంలో ఒబామా జీవిత చరిత్ర, అంతర్‌ దృష్టి, హాస్యం, చతురత అని మేళవించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ సమీక్షించింది.