పోలీస్ లపై ఫిర్యాదులకు ప్రత్యేక సెల్ 

కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ తీసి, ఆ తర్వాత రైలు కింద పడి చనిపోయిన షేక్‌ అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన ఏపీ పోలీస్ లో తీవ్ర కలకలం రేపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం సహితం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందనిపరిగణింపవలసి వచ్చింది. 

పోలీస్ సంస్కరణలతో భాగంగా ప్రతి రాష్ట్రంలో పోలీస్ లపై ఫిర్యాదులకు ఒక విభాగంను ఏర్పాటు చేయాలనీ సుప్రీం కోర్ట్ సూచించిన 15 ఏళ్ళ అనంతరం ఇప్పుడు అటువంటి విభాగం ఏర్పాటు చేయాలని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంనిర్ణయించింది. ఈ విషయాన్ని  హోంమంత్రి సుచరిత వెల్లడించారు.

పోలీసులెవరైనా వేధింపులకు పాల్పడితే ఫిర్యాదు చేయడానికి డిజిపి కార్యాలయంతో పాటు ప్రతి జిల్లా ఎస్‌పి ఆఫీసులో ప్రత్యేక సెల్‌, హెల్ప్‌ లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సంఘటన గురించి తెలియగానే  సంబంధిత  అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి  డిజిపికి ఆదేశాలు కూడా జారీ చేశారని ఆమె గుర్తు చేశారు. అదేరోజు ప్రాథమిక విచారణ జరిపి వెంటనే నంద్యాల సీఐ సోమశేఖర్‌రెడ్డిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.

పైగా,  కేసు దర్యాప్తుకు  ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను నంద్యాలకు పంపాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించడంతో బెటాలియన్స్‌ ఐజీ శంకబ్రత బాగ్చీ, గుంటూరు అడిషనల్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌లను వెంటనే  నంద్యాలకు పంపినట్లు చెప్పారు. డిఐజి వెంకటరామిరెడ్డి, ఆళ్లగడ్డ డిఎస్పీకి కేసు విచారణ బాధ్యతలను అప్పగించామని పేర్కొన్నారు.

ఘటన వెలుగులోకి వచ్చిన 24 గంటల్లోనే షేక్‌ అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను బాధ్యులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. భారత శిక్షాస్మఅతి ఐపీసీ సెక్షన్‌-323, సెక్షన్‌-324, సెక్షన్‌-306 (ఆత్మహత్యకు పురికొల్పడం) కింద కేసులు నమోదు చేశామని చెప్పారు.

అబ్దుల్‌ సలాం (45).. భార్య నూర్జహాన్‌ (38), కుమార్తె సల్మా (14), కుమారుడు దాదా ఖలందర్‌ (10)తో కలిసి పాణ్యం మండలం కౌలూరు వద్ద గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బంగారు షాపులో చోరీ, ఆటోలో దొంగతనం వంటి కేసుల్లో పోలీసులు అబ్దుల్‌ సలాంను వేధించినట్లు అప్పట్లోనే ఆయన బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలోనే.. ఆత్మహత్యకు ముందు అబ్దుల్‌ సలాం కన్నీటి పర్యంతమవుతూ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చింది.

నంద్యాలలో పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ తీసి, ఆ తర్వాత రైలు కింద పడి చనిపోయిన షేక్‌ అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన ఏపీ పోలీస్ లో తీవ్ర కలకలం రేపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం సహితం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందనిపరిగణింపవలసి వచ్చింది. 

పోలీస్ సంస్కరణలతో భాగంగా ప్రతి రాష్ట్రంలో పోలీస్ లపై ఫిర్యాదులకు ఒక విభాగంను ఏర్పాటు చేయాలనీ సుప్రీం కోర్ట్ సూచించిన 15 ఏళ్ళ అనంతరం ఇప్పుడు అటువంటి విభాగం ఏర్పాటు చేయాలని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంనిర్ణయించింది. ఈ విషయాన్ని  హోంమంత్రి సుచరిత వెల్లడించారు.

పోలీసులెవరైనా వేధింపులకు పాల్పడితే ఫిర్యాదు చేయడానికి డిజిపి కార్యాలయంతో పాటు ప్రతి జిల్లా ఎస్‌పి ఆఫీసులో ప్రత్యేక సెల్‌, హెల్ప్‌ లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. .

ఈ సంఘటన గురించి తెలియగానే  సంబంధిత అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి  డిజిపికి ఆదేశాలు కూడా జారీ చేశారని ఆమె గుర్తు చేశారు. అదేరోజు ప్రాథమిక విచారణ జరిపి వెంటనే నంద్యాల సీఐ సోమశేఖర్‌రెడ్డిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.