ఎర్రచందనం స్మగ్లర్ బాషా భాయ్ అరెస్ట్

ఎర్రచందనం స్మగ్లర్ బాషా భాయ్ అరెస్ట్

ఎర్రచందనం అంతర్ రాష్ట్ర స్మగ్లర్ బాషా భాయ్ అరెస్టయ్యాడు. ఇటీవల తమిళ కూలీల సజీవ దహనం ఘటన లో బాషా భాయ్ ప్రధాన నిందితుడు. పట్టుబడిన స్మగ్లర్ బాషా భాయ్ తో పాటు మరో 11 మందిని మీడియా ముందు కడప జిల్లా ఎస్పీ అన్బు రాజన్మీ ప్రవేశ పెట్టారు.

బాషా భాయ్ అసలు పేరు హకీమ్ అలీ అలియాస్ బాషా భాయ్. గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి చెన్నైకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. ఇతనిపై జిల్లాలో మూడు పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నాయి.

తమిళ కూలీలను ఛేజ్ చేస్తూ మొత్తం 5 మంది వాహనాల్లోనే సజీవ దహనం కావడానికి ప్రధాన కారణం బాషా భాయ్ అని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఈ కేస్ ని సవాల్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

మొత్తం 5 బృందాలను జిల్లా ఎస్పీ రంగంలోకి దింపారు. సైబర్ టీం ఇచ్చిన కీలక సమాచారం మేరకు నిందితులను పట్టుకోగలిగామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

తమిళ కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు కోడూరు లో ఇద్దరిని పట్టుకున్నామని.. బాకారపేట లో ఎర్రచందనం లోడ్ చేశారని వివరించారు.

ప్రధాన నిందితుడు హకీమ్ అలీ  అలియాస్ బాషా భాయ్ తమిళ కూలీలను వెంబడించిన కారుల్లో ఉన్న తన అనుచరులతో నిరంతరం టచ్ లో ఉండడంతో వెంటనే పట్టుకున్నామని వివరించారు.