పలు ఉత్కంఠ మలుపుల అనంతరం అమెరికా 46వ అధ్యక్షునిగా ఎన్నికైన జో బిడెన్, ఉపాధ్యక్షురాలు కమల్ హరీష్ లకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
”అద్భుతమైన విజయం సాధించిన బిడెన్‌కు అభినందనలు.. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మీ సహకారం ఎంతో అమూల్యమైనది. భారత్-అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని మోడీ ట్వీట్ చేశారు.
అలాగే బెడెన్‌తో కరచాలనం చేసిన ఫొటోను కూడా షేర్ చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలిచిన భారత సంతతి సెనేటర్ కమలాహారిస్‌కు కూడా మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
”అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన కమలా హారిస్‌కు హృదయపూర్వక అభినందనలు. మీ విజయం చరిత్రాత్మకం. ఇది మీకే కాకుండా భారతీయ అమెరికన్లందరికీ గర్వకారణం. మీ మద్దతు, నాయకత్వంతో శక్తివంతమైన భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని నా నమ్మకం” అని మోదీ పేర్కొన్నారు.
More Stories
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ
కోల్‌కతా పోలీస్ కమిషనర్‌పై వేటుకు మమతా సమ్మతి
ప్రతిపక్షాలకు దేశం పట్ల ఎటువంటి బాధ్యత లేదు