భారత మాజీ ఉప ప్రధానమంత్రి, బీజేపీ ఎల్ కె 93వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన రాజకీయ గురువు అద్వానీ ఇంటికి వెళ్లి పాదాభివందనం చేసి ఆశీర్వదాలు తీసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేయించి పుట్టిన రోజు వేడులకును జరిపారు.
దీనికి సంబంధిన ఫోటోలను మోదీ తన ట్విటర్ ఖాతాలో ఫోస్ట్ చేస్తూ..‘అద్వానీ జీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన నివాసానికి వెళ్లడం జరిగింది. ఆయనతో సమయం గడపటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. పార్టీ కార్యకర్తలకు, దేశానికి ఆయన సజీవ ప్రేరణ. ఆయన జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
అద్వానీ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని ప్రధాని మోదీ కొనియాడారు. బిజెపిని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత అద్వానీకే దక్కుతుందని వెల్లడించారు. ప్రధాని మోదీ వెంటహోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్లపై వేటు