
రాష్ట్రంలో రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన జరుగుతుందా? లేదా, అన్నదానిని విచారిస్తామని అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రమైన వాఖ్యలు చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలను తాము గమనిస్తున్నామని పేర్కొంది.
హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విజయవాడకు చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లంటి లోచిని పిటిషన్లను జస్టిస్ రాకేష్ కుమార్ బెంచ్ విచారించింది.
న్యాయపరమైన అవకాశాలను పరిశీలించి తమకు తెలియజేయాలని, పిటిషనర్ తరపున న్యాయవాది రవితేజను ధర్మాసనం ఆదేశించింది. రెడ్డి గౌతమ్, లోచిని హెబియస్ కార్పస్ పిటిషన్‌పై న్యాయ విచారణ విధానాన్ని తప్పుబట్టడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది శాసనమండలిలో వ్యతిరేకిస్తే శాసనమండలి రద్దుకు సిఫారుసు చేసిన విధానం తమ దృష్టిలో ఉందని న్యాయస్థానం పేర్కొంది.
రాష్ట్రంలో దాఖలవుతున్న హెబియస్ కార్పస్ పిటిషన్లను పరిశీలిస్తున్నామని, సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై వచ్చిన పోస్టింగ్స్‌పై రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసినా సీరియస్‌గా తీసుకోకపోవడాన్ని గమనించామని హైకోర్టు వ్యాఖ్యానించింది.
More Stories
తన తండ్రి హత్యా కేసుపై గవర్నర్ కు డా. సునీత ఫిర్యాదు
అవిశ్వాస తీర్మానంకు భయపడి గుంటూరు మేయర్ రాజీనామా
మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను