
కేంద్రం తీసుకువచ్చిన రైతు సంస్కరణల బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళన కొనసాగుతుండటంతో రైల్వేలకు రూ.1,200 కోట్ల మేరకు నష్టం వచ్చింది. దిగ్బంధాల కారణంగా రవాణా కార్యకలాపాలు ఇప్పటికీ సస్పెండైనట్టు భారత రైల్వేలు తెలిపాయి.
దీంతో ఇంతవరకూ నిత్యావసర సరుకలు తీసుకువెళ్తున్న 2,225 ఫ్రైట్ రేక్స్ తెరుచుకోలేదని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాక్‌ల భద్రత, రైల్ ఆపరేషన్ల పునరుద్ధరణ జరిపే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటూ అక్టోబర్ 26న రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ సైతం పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
రాకపోకల ప్రభావం పంజాబ్‌తో పటు, లఢక్, హిమాచల్ ప్రదేశ్‌పైన కూడా పడిందని తెలిపింది. గత సెప్టెంబర్‌లో రైతు గ్రూపులు, యూనియన్లు ఆందోళనకు దిగుతూ మూడు రోజుల రైల్‌రోకోకు పిలుపునిచ్చాయి. ఆ తర్వాత కూడా ఆందోళనలు కొనసాగుతూ వచ్చాయి.
More Stories
పప్పుదినుసుల సేకరణపై పరిమితి తొలగించిన కేంద్రం
మార్గదర్శి ఎండి శైలజను ప్రశ్నించిన ఏపీ సిఐడి
డ్రగ్ మాఫియా నెట్ వర్క్ ఛేదించిన ఎన్ సి బి