
పోలవరం ప్రాజెక్ట్‌పై గత కొద్దిరోజులుగా నెలకొన్న గందరగోళంను కేంద్ర ఆర్థిక శాఖ తెరదించింది. పోలవరం బకాయిలపై కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. దీంతో పోలవరం బకాయిల విడుదలకు మార్గం సుగమం అయ్యింది.
ఎలాంటి షరతులు లేకుండా పోలవరం ప్రాజెక్ట్ బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థికశాఖ మెమో పంపింది. రూ.2,234.288 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. పీపీఏ ప్రక్రియ పూర్తి చేయాలంటూ జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థికశాఖ మెమో పంపింది.
ఇలా ఉండగా, పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా ఖరారు చేసిన్నట్లు కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అత్యవసర సమావేశంలో తేల్చి చెప్పిన్నట్లు తెలుస్తున్నది.
‘‘కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లు మాత్రమే. 2013-14 అంచనా వ్యయమే ఫైనల్. దీనిపై ఇక తదుపరి మాటలేవీ ఉండవు. కేంద్ర నిర్ణయాన్ని మీకు తెలియజేస్తున్నాం’’ అని పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ తెలిపారు.
అయితే మొత్తంతో ప్రాజెక్టు పూర్తి చేయడం పట్ల ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సందేహం వ్యక్తం చేశారు. మరోవంక, పోలవరం నిర్మాణ పనుల తీరుపై పీపీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది.
షెడ్యూల్ ప్రకారం జరగడంలేదని, తీవ్ర జాప్యం జరుగుతోందని అయ్యర్ పేర్కొన్నారు. ఇలాగైతే 2021 డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టమేనని చెప్పారు. షెడ్యూల్ మేరకు పనులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
భేటీలో పాల్గొన్న తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు… పోలవరం ముంపుపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ అంశంపై పొంగులేటి సుధాకర రెడ్డి జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు వేసినందున దీనిపై ఈ సమావేశంలో చర్చించేందుకు వీల్లేదని అయ్యర్ స్పష్టం చేశారు.
More Stories
రైల్వే ప్రమాదానికి కారణం, బాధ్యులను గుర్తించాం
ఆసక్తి కలిగిస్తున్న అమిత్ షాతో చంద్రబాబు భేటీ
ముగిసిన రెస్క్యూ ఆపరేషన్ .. ట్రాక్ పునరుద్ధరణ ప్రారంభం