
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీని ఓడించడానికి అవసరమైతే తాము బీజేపీకి కూడా ఓటు వేయడానికి సిద్ధమేనని మాయావతి సోమవారం పునరుద్ఘాటించారు. సమాజ్‌వాదీ దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, వాటిని వ్యతిరేకించడానికి తాము ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటున్నామని ఆమె ప్రకటించారు.
గతంలో కూడా మాయావతి ఇదే ప్రకటనను చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్పీకి తగిన బుద్ధి చెప్పడానికి పూర్తి శక్తిని వినియోగిస్తామని, బీజేపీకి ఓటు వేయడానికి కూడా తాము సిద్ధమేనని మాయావతి ప్రకటించారు.
‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి సర్వ శక్తులూ ఒడ్డుతాం. బీజేపీకి కూడా ఓటు వేయడానికి సిద్ధంగానే ఉంటాం. లేదంటే మరో పార్టీకి. దీన్ని కచ్చితంగా ఆచరణాత్మకంగా చేసి చూపిస్తాం.’’ అని మాయావతి సంచలన ప్రకటన చేశారు.
సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ సమాజ్‌వాదీ వ్యవహరించే తీరును చూస్తూనే ఉన్నామని ఆమె పేర్కొన్నారు.
More Stories
దక్షిణాది బలోపేతం కాకుండా ‘వికసిత్ భారత్’ సాధ్యం కాదు
విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం తోనే తొక్కిసలాట
వేలాదిమంది గంగాజలం సేకరణతో కన్వర్ యాత్ర ప్రారంభం