మార్చ్ తర్వాత భారత్‌ బయోటెక్ వ్యాక్సిన్ 

భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)లతో కలిసి భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన ‘కొవాగ్జిన్‌’ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది మార్చి తర్వాత అందుబాటులోకి రానున్నట్లు అంచనాలు ఉన్నాయి. 

2021 రెండో త్రైమాసి కంలో వ్యాక్సిన్‌ విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని, ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌పై పూర్తిగా దృష్టిని కేంద్రీ కరించామని భారత్‌ బయోటెక్‌ తెలిపింది.

సమర్థత, భద్రతకు సంబంధించి ట్రయల్స్‌లో కచ్చితమైన రుజువు లభించి, నియంత్రణ సంస్థల అనుమతులు పొందిన తర్వాతే వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్‌ సాయి ప్రసాద్‌ స్పష్టం చేశారు. 

కొవాగ్జిన్‌ మూడో దశ ట్రయిల్స్‌కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతులు లభించా యన్నారు. వలెంటీర్ల ఎంపిక, వ్యాక్సిన్‌ ప్రయోగాలను ఈనెలలోనే ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.