ఓ మాదిరి కరోనాకు ఆయుర్వేదమే భేషు

తక్కువ స్థాయి కరోనా కేసులలో ఆయుర్వేద చికిత్సలు బాగా పనిచేస్తున్నాయి. ఆలిండియా ఇనిస్టూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ)కు చెందిన డాక్టర్ల బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాన్ని నిర్థారించింది. 
 
ఆయుష్ క్వత్, ఫిఫట్రోల్ మాత్రలు వేసుకుంటే స్వల్పస్థాయి నుంచి ఓ మోస్తరు కరోనా వచ్చిన వారికి మేలు జరుగుతుంది. ఇటువంటి కేసులలో వీటిని వాడినట్లు అయితే అతి తక్కువ కాలంలోనే పూర్తిస్థాయిలో వైరస్ లక్షణాలు తిరోముఖం పడుతాయని తేల్చారు. 
 
ఆయుష్షు మంత్రిత్వశాఖ పరిధిలో ఎఐఐఎ పనిచేస్తొంది. శనషమనవతి, లక్ష్మివిలాస రసలు కూడా తీసుకున్న కోవిడ్ 19 రోగులలో సత్వర ఉపశమనం కన్పించిందని, వీటిని తీసుకున్న తరువాత కేవలం ఆరురోజుల వ్యవధిలోనే కరోనా లక్షణాలు తగ్గుముఖం పట్టిన దాఖలాలు కన్పించాయని తెలిపారు. 
 
ఈ డాక్టర్ల బృందం చేపట్టిన అధ్యయన వివరాలను సంస్థకు చెందిన ఆయుర్వేద చికిత్సల నివేదికల పత్రిక అక్టోబర్ సంచికలో ప్రచురించారు.