హైదరాబాద్ బీజేపీ కార్యాలయం ఎదుట విషాదం చోటు చేసుకుంది. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ బీజేపీ కార్యకర్త ఒంటిమీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ బండిసంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ బీజేపీ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
40శాతం శరీరం కాలిన గాయాలతో ఆహాకారాలు చేస్తూ బండిసంజయ్ అంటే నాకు ప్రాణం. ఆయనకోసం నా గుండె కోసిస్తా. పార్టీకోసం నా ప్రాణం త్యాగం చేస్తానని అంటూ ఆహాకారాలు చేసాడు.
దీంతో అప్రమత్తమైన స్థానికులు శ్రీనివాస్ పై నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఆత్మహత్య యత్నం విషయం తెలుసుకున్న పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దుబ్బాక ప్రచారంలో ఉన్న ఆయన.. హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. శ్రీనివాస్‌కు సరైన చికిత్స అందేలా చూడాలని అందుబాటులో ఉన్న కార్యకర్తలకు సూచించారు.
కాగా బండి సంజయ్ హుటాహుటీన దుబ్బాక నుంచి హైదరాబాద్ కు వచ్చి, ఉస్మానియా ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి మంచి వైద్యం అందింస్తామని చెప్పారు.
More Stories
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
ప్రజాపాలన దినోత్సవం కాదు… ప్రజావంచన దినోత్సవం
ట్యాంక్బండ్ వద్ద ఫ్లెక్సీలు, బారికేడ్లను తొలిగిన గణేశ్ ఉత్సవ సమితి