దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్‌కు అక్కడ పార్టీ మీటింగ్ పెట్టే దమ్ము కూడా లేదని బీజేపీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే సీఎం దుబ్బాకకు రాకుండా రైతు వేదికలు, ధరణి పేరుతో ఇతర జిల్లాల్లో మీటింగ్‌లు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
ఆరేండ్లలో దుబ్బాకకు కేసీఆర్ చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘దుబ్బాకలో బీజేపీ గెలిచేది లేదు. పీకేది లేదు’ అని టీఆర్ ఎస్ అనడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘‘ ఇక్కడ టీఆర్ఎస్ గెలుపుపై మంత్రి హరీష్ రావుకు ఆశలు సన్నగిల్లాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని ఆయన చేసిన కామెంట్సే ఇందుకు నిదర్శనం” అని గుర్తు చేశారు.
`సభ్యత, సంస్కారం గురించి మాట్లాడే కేటీఆర్.. ముందు మీ నాన్నకు అవి నేర్పించు’ అని ఇంద్రసేనారెడ్డి హితవు చెప్పారు. తెలంగాణలో మక్కలు కొనటానికి, రైతు వేదికల నిర్మాణానికి కేంద్రమే నిధులిస్తోందని చెప్పారు. తెలంగాణకు అప్పు పుట్టని దుస్థితిని కేసీఆర్ తెచ్చుకున్నారని ఇంద్రసేనా రెడ్డి విమర్శించారు.
More Stories
కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమే
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్