`లవ్ జీహాద్’ కట్టడికి యుపిలో చట్టం  

‘లవ్ జీహాద్’కు కళ్లెం వేసేందుకు తమ ప్రభుత్వం ఒక చట్టం తెస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. కేవలం వివాహం కోసం మతం మారడం చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన ఈ  ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

తమ గుర్తింపును దాచిపెట్టి హిందూ మహిళల గౌరవంతో ఆడుకునేవారు ఇకపై తమ మార్గాలను చక్కదిద్దుకోవాలని ముఖ్యమంత్రి హితవు చెప్పారు. అలా కుదరనిపక్షంలో వారి ‘రామ్ నామ్ సత్య’ ప్రయాణం (అంతిమ యాత్ర) ప్రారంభమవుతుందని యోగి హెచ్చరించారు.

‘వివాహం కోసం మత మార్పిడి అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. మా ప్రభుత్వం కూడా లవ్ జీహాద్‌కు కళ్లెం వేసే దిశగా కసరత్తు చేస్తోంది. దీనిపై ఒక చట్టం తీసుకువస్తాం’ అని వెల్లడించారు. తమ వైవాహిక జీవితంలో పోలీసులు, తన తం డ్రి జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని కోరుతూ ఓ యువతి, ఆమె భర్త దాఖలు చేసిన పిటిషన్‌‌ను అలహాబాద్ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది.

 ప్రియాన్షి అలియాస్ శామ్రీన్, ఆమె భాగస్వామి వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందిస్తూ, యువతి తొలుత మతం మారిన తర్వాత వివాహం చేసుకుందని, 2020 జూన్ 29న మతం మారగా, జులై 31న పెళ్లి జరిగిందని పేర్కొంది. దీనినిబట్టి కేవలం వివాహం చేసుకోడానికే ఆమె మతం మారినట్టు స్పష్టమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. 

నిందితుడు తౌసెఫ్.. ఆమెను ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తనతో స్నేహం చేసుకోవటానికి అవరోధంగా నిలిచినందున తన గుర్తింపు గురించి అతడు నికితా తోమర్‌కు అబద్ధం చెప్పాడని ఫిర్యాదులో యువతి తల్లిదండ్రులు తెలిపారు.

పెళ్లి కోసం మతం మారడం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది. ఎదుటి మతం గురించి ఎలాంటి అవగాహన, నమ్మకం, విశ్వాసం లేకుండా మతం మారిన తర్వాత వివాహం చేసుకోవడం అంటే బలవంతపు మతమార్పిడేనని హైకోర్టు పేర్కొంది.

నిందితుడు తౌసెఫ్.. ఆమెను ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తనతో స్నేహం చేసుకోవటానికి అవరోధంగా నిలిచినందున తన గుర్తింపు గురించి అతడు నికితా తోమర్‌కు అబద్ధం చెప్పాడని ఫిర్యాదులో యువతి తల్లిదండ్రులు తెలిపారు.