టిడిపిలో ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీలో చేరాలి 

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీలో చేరాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపిచ్చారు. ఎన్టీఆర్ కుమార్తె పురంధ్రేశ్వరికి పార్టీ కేంద్ర కమిటీలో కీలక స్థానం కల్పించామని ఆయన గుర్తు చేశారు. జయనగరం జిల్లాకు చెందిన టిడిపి సీనియర్‌ నేత, మాజీ ప్రభుత్వ విప్‌ గద్దె బాబురావు శనివారం సోము వీర్రాజు,  ఏపీ సహ ఇంచార్జి సునీల్‌ దేవధర్‌ లసమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ఎవ్వరినైనా వాడుకుని వదిలేస్తారని ధ్వజమెత్తారు.
గత ఎన్నికల్లో తనకు అనుకూలమైన వ్యక్తులకు సీటివ్వలేదని పోత్తును వదులుకున్నటు చంద్రబాబు ప్రకటించాడని, మళ్లీ సాయంత్రమే కాళ్లబేరానికొచ్చాడని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ని వాడుకున్నాడు, మోసగించాడు, వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు.
 
రాష్ట్రంలో చంద్రబాబు ఏం చేయగలడు..? నిర్మాణమైన ప్రతిపక్ష పాత్రను కూడా సరిగా పోషించలేకపోతున్నారని వీర్రాజు దుయ్యబట్టారు. బీజేపీ జాతీయ పార్టీ. మోడీ ఇజమ్.. ఎన్టీఆర్ విధానాలను ఇప్పుడు బీజేపీ అనుమతిస్తోందని చెప్పారు.    
 
కాగా, వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. 
 
 జగన్ పాలనలో సింహాచలం నుంచి తిరుపతి దేవస్థానం వరకు దేవాదాయ భూములు వైసీపీ నేతల హస్తగతమవుతున్నాయని సునీల్ దేవదారు ఆరోపణలు చేశారు. ఏపీలో హిందూ మతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మత వ్యాప్తికి, అభివృద్ధికే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని సునీల్ దేవధర్ ఆరోపించారు.