బెంగళూరు డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్‌కు సంబంధించి సీపీఎం కేరళ సెక్రటరీ కొడియేరి బాలకృష్ణన్ తనయుడు బినీష్ కొడియేరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. కోర్టు ముందు ఆయనను హాజరుపరచగా నవంబర్ 2 వరకూ ఈడీ కస్టడీకి కోర్టు ఆదేశించింది.
ఈడీ కథనం ప్రకారం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం-2002లోని సెక్షన్ 19(1) కింద బినీష్‌ను ఈడీ అరెస్టు చేసింది. బినీష్‌కు అసోసియేట్‌గా తాను మాదకద్రవ్యాల అమ్మకం, కొనుగోలు జరిపేవాడినని ఇటీవల అరెస్టయిన మాదకద్రవ్యాల సరఫరాదారు మొహమ్మద్ అనూప్‌ను ఈడీ ఇంటరాగేషన్‌లో వెల్లడించారు.
బినీష్‌కు బినామీదారుగా అనూప్ వ్యవహరించే వాడని, అతని ఆర్థిక వ్యవహారాలన్నీ బినీష్ ఆదేశాలతోనే చేసేవాడని, అందుకోసం అనూప్‌కు బినీష్ పెద్ద మొత్తంలో సొమ్ములు ఇచ్చేవాడని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, డబ్బు, నిధుల లావాదేవీలకు సంబంధించి అనూప్ పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్టు ఈడీ తెలిపింది.
1985 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టానెన్స్ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద బెంగళూరుకు చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మహమ్మద్ అనూప్, తదితరులపై ఈడీ ఇన్విస్టిగేషన్ జరుపుతోంది.
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ