వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విషయంలో పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వాకు వెన్నులో వణుకు పుట్టిందన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా కాక రేపుతోంది. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన మరు క్షణమే మరో వార్త పాక్ కు శరాఘాతమై కూర్చుంది.
పాకిస్తాన్ పార్లమెంట్‌లో బలూచిస్తాన్ ఎంపీలు కట్టగట్టుకొని మోదీ మోదీ… మోదీ… అంటూ నినాదాలిచ్చారు. దీంతో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీకి చిర్రెత్తింది. ప్రసంగం మధ్యలోనే ఆపేసి, సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
బలూచిస్తాన్ వ్యవహారంపై సభలో తీర్మానం చేసి, బలూచిస్తాన్ ఉద్యమం గురించి ఖురేషీ ప్రసంగిస్తున్నారు. ఈ సమయంలో బలూచిస్తాన్ ఎంపీలు మోదీని పొగుడుతూ… మోదీ… మోదీ.. మోదీ.. అంటూ పెద్దపెట్టున నినాదాలిచ్చారు. అంతేకాకుండా మంత్రి ప్రసంగానికి ఆ ఎంపీలు పదే పదే అడ్డుతగిలారు.
దీంతో చిర్రెత్తిన ఖురేషీ. ఆ ఎంపీల హృదయాల్లోకి మోదీ ఆశలు చొచ్చుకొచ్చాయని మండిపడ్డారు. భారత దేశ దృక్కోణాన్ని ప్రతిపక్ష సభ్యులు పాక్‌లో అమ్ముతున్నారని, జాతీయ సంస్థలను తీవ్రంగా కించపరుస్తున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
ప్రతిపక్ష నేతల నియోజకవర్గాల నుంచే బలూచిస్తాన్ స్వతంత్య్రం కోసం నినాదాలు రావడం సిగ్గుచేటని విదేశాంగ మంత్రి ఖురేషీ నిప్పులు చెరిగారు.
More Stories
ఇజ్రాయిల్ నగరాలపై రాకెట్ల వర్షం
సరిహద్దుల్లోకి డ్రాగన్ డ్రోన్లు.. నిఘా కోసమేనా?
వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం