
దేశంలోని ప్రతిఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఏ ఒక్క వ్యక్తినీ విడిచిపెట్టకుండా, అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తేస్తామని ప్రకటించారు. దేశ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని, అప్పుడే కరోనా సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి పోరాడుతున్న వారికి, ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం దేశంలోని ప్రతి పౌరుడికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ఆయన చెప్పారు.
వ్యాక్సిన్ తయారీ పురోగతిలో ఉందని, పలు వ్యాక్సిన్లపై ట్రయల్స్ కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
వ్యాక్సిన్ పంపిణీ కోసం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామని, వ్యాక్సిన్ పంపిణీ కోసం మార్గదర్శకాలను ఈ బృందం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. దేశంలో వ్యాక్సిన్ ప్రతి పౌరుడికి చేరేలా 28 వేలకు పైగా కోల్డ్ చైన్ పాయింట్లను సిద్ధం చేస్తామని ఆయన వెల్లడించారు.
దేశంలో కరోనా విస్తరణ వింతగా ఉంటుందని, ఒక రాష్ట్రంలో కరోనా హాట్ స్పాట్ అనుకునే లోపే, అక్కడ తగ్గిపోతుందని , మరో చోట విజృంభిస్తుందని మోడీ తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, బయటకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని, అప్పుడే కరోనా కట్టడి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
More Stories
రక్షణ రంగంలో భారత్, అమెరికా పారిశ్రామిక సహకారం
జూన్ 11న సచిన్ పైలట్ సొంత పార్టీ ప్రకటన?
ఇది కచ్చితంగా విద్రోహ చర్యే!