జాతీయ స్థాయిలో పోలీస్ శాఖలో సాంకేతికత వినియోగాలపై స్కొచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో భాగంగా జాతీయ అవార్డులను ప్రకటించింది. మొత్తం 84 అవార్డులను ప్రకటించిగా రికార్డు స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ 48 అవార్డులను దక్కించికుంది.
కేరళ-9, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్-4, తెలంగాణ-1, తమిళనాడు-1 అవార్డులను దక్కించుకున్నాయి. ఇక ఏపీ పోలీసు శాఖ వరుసగా రెండవ సారి సాంకేతికత వినియోగంలో జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సంవత్సరం ఇప్పటికే 37 అవార్డులు సాధించిన ఏపీ పోలీస్ శాఖ తాజాగా వివిధ విభాగాల్లో 48 అవార్డులు కైవసం చేసుకోని మొత్తం 85 అవార్డుతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అత్యధిక అవార్డులు దక్కించుకోవడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసు శాఖను అభినందించారు. మహిళా రక్షణ కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన దిశ, దాని సం భందిత విభాగంలో అందిస్తున్న సాంకేతికత సేవలకుగాను 5 అవార్డులను సొంతం చేసుకుంది.
ఇటీవల ప్రజల కోసం 87 సేవలతో అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్‌కు గాను అవార్డు లభించింది. ఇక కోవిడ్ సమయంలో అందించిన, అందిస్తున్న మెరుగైన సంక్షేమానికి గాను 3 అవార్డులు లభించాయి. టెక్నికల్ విభాగంలో -13 అవార్డులు, సీఐడీ- 4, కమ్యూనికేషన్-3, విజయవాడ, కర్నూల్ జిల్లాకు -3, ప్రకాశం, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాకు-2, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు,గుంటూరు(అర్బన్), గుంటూరు(రూరల్), కృష్ణ జిల్లాకు- 1 అవార్డులు లభించాయి.
సాంకేతికత వినియోగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారితనంతో, త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నామని, సీఎం జగన్ తెలిపారు. జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందించారు. ఇక సీఎం పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు సాధిస్తున్నామన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
More Stories
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు
ఏడాదిలోగా గన్నవరంలో ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్
కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్