సానియా మిర్జా ఫాంహౌస్ నుండే కాల్పులు !

సానియా మిర్జా ఫాంహౌస్ నుండే కాల్పులు !

వికారాబాద్ అడవుల్లో కాల్పుల ఘటనలో కొత్త కోణం బ‌య‌ట‌ప‌డింది. దామగుండంలో ఎద్దును షూట్ చేసి చంపిన ఘ‌ట‌న‌లో కొత్త విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆ ప్రాంతంలో  ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జా, ఆమె బంధువులకు ఫామ్ హౌజ్ లు ఉన్నాయ‌ని, ఆ ఫాం హౌజ్ కు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. 

ఇదే విష‌య‌మై ఫామ్ హౌజ్ నిర్వాహకులను, సిబ్బందిని పోలీసులు విచారించగా వారు స్థానికులను బెదిరిస్తున్నట్టుగా తెలిసింది. ఈ సందర్భంగా సానియా మిర్జా ఫాంహౌస్ సెక్యూరిటీ అధికారిని అరెస్టు చేశారు. తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఫామ్ హౌజ్ నిర్వాహకులు కాల్పులు జరిపినప్పుడు ఆ ఘటనలో ఎద్దు చనిపోయిందని, అది జ‌రిగిన‌ మరుసటి రోజు నుంచి ఫాంహౌస్ నిర్వాహకులు ఎద్దు య‌జ‌మానిని బెదిరించార‌ని తెలుస్తున్నది. కొద్ది రోజులుగా ఫామ్ హౌజ్ పరిసర ప్రాంతాల్లో ఎవ్వరు కూడా పశువులను తీసుకు రావద్దని గ్రామస్తులను వారు హెచ్చరించగా గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఫామ్ హౌజ్ నిర్వాహకులను, సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాల్పుల ఘటనపై కీలక సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ స్వాధీనం చేసుకున్న బుల్లెట్లు ఏ రివాల్వర్ నుంచి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు. ఫాం హౌస్ ఇంచార్జీ ఉమ‌ర్ ఎద్దును కాల్చి చంపినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.