వికారాబాద్ జిల్లా దామగుండలో ఆవును తుపాకీతో కాల్చి చంపిన కేసులో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఉందంటూ బిజెపి ఎమ్యెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఫామ్‌హౌస్‌లో సానియా మీర్జానే కాల్పులు జరిపిందని గ్రామస్తులు చెప్తున్నట్లు రాజా సింగ్ పేర్కొన్నారు.
సానియా గతంలో కూడా నెమలిని చంపినట్లు గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే తెలిపారు. గోమాతపై కాల్పుల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.
వికారాబాద్ అడవుల్లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో సానియా మీర్జా ఫామ్‌హౌస్ ఇంచార్జి ఉమర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం ఫామ్‌హౌస్‌లో మేతకు వచ్చిన ఆవును కాల్చి చంపినట్లు ఉమర్‌పై ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయమై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి తుపాకీ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
More Stories
ప్రజాపాలన దినోత్సవం కాదు… ప్రజావంచన దినోత్సవం
ట్యాంక్‌బండ్ వద్ద ఫ్లెక్సీలు, బారికేడ్లను తొలిగిన గణేశ్ ఉత్సవ సమితి
ముడి పామాయిల్ దిగుమతిపై పన్ను పెంపు