జమ్ముకాశ్మీర్‌లో ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి)కి ముగ్గురు నేతలు గుడ్‌బై చెప్పారు. ఆమె వ్యాఖ్యలు దేశభక్తిని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ వారు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పీడీపీకి రాజీనామా చేసిన నేతల్లో పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పుర్బ రాజ్య సభ సభ్యుడు త్రిలోక్ సింగ్ బజ్వా, పుర్బ లెసిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్యే వేద్ మహాజన్, గుజ్జర్ నేత చౌదరి మహమ్మద్ హుస్సేన్ వఫా ఉన్నారు. తమ రాజీనామా లేఖలను పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీకి పంపారు
ఆమె వ్యాఖ్యలు, చర్యలు అసౌకర్యంగా ఉన్నాయని, ముఖ్యంగా దేశభక్తి మనోభావాలను గాయపరచేలా ఉన్నాయని వారు తమ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు
సుమారు ఏడాది పాటు గృహ నిర్బంధంలో ఉంచిన మెహబూబా ముఫ్తీని ఇటీవల విడుదల చేశారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకు, రాష్ట్ర ఏకీకరణ జరిగేంత వరకు, పాత జమ్ముకశ్మీర్ జెండా ఎగిరే వరకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబోమని ఇటీవల ఆమె చేసిన వాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి
ఆమె వ్యాఖ్యలపై బీజేపీ సహా పలు పార్టీల నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకు పోరాటం సాగిస్తామని ఇటీవల ఆరు పార్టీలు కలిసి పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ గా ఏర్పడిన సంగతి తెలిసిందే. . . .
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి