దేశంలో కరోనా వైరస్ రికవరీ రేటు 90.62 శాతానికి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ భూషన్ వెల్లడించారు. గత అయిదు వారాల నుంచి దేశంలో కరోనా వల్ల మృతిచెందుతున్న వారి సంఖ్య సగటును తగ్గుతున్నట్లు తెలిపారు. 10 రాష్ట్రాలు, యూటీల్లో 78 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చత్తీస్‌ఘడ్, కర్నాటక రాష్ట్రాల్లోనే 58 శాతం మరణాలు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. పండుగ వేళల్లో కేరళ, బెంగాల్, మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీల్లో కేసుల సంఖ్య పెరిగినట్లు ఆయన తెలిపారు.
లక్ష నుంచి 10 లక్షల రికవరీ చేరుకోవడానికి 57 రోజుల సమయం పట్టినట్లు భూషన్ తెలిపారు. అయితే తాజాగా పది లక్షల రికవరీలు కేవలం 13 రోజుల్లో అందుకున్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా, ఆర్థికంగా, జీడీపీలో బలంగా ఉన్న దేశాలు, ఆరోగ్యపరంగా దిట్టంగా ఉన్న దేశాల్లోనూ రెండవ దఫా కరోనా కేసులు విజృంభిస్తున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డా. వికె పాల్ తెలిపారు.
అయితే మనం చాలా అదృష్టవంతులమని, మన దగ్గర రెండో దఫా కేసుల పెరుగుదల లేదని చెప్పారు. ఎక్కువ సంఖ్యలో గుమ్మిగూడడమే కాదు, తక్కువ సంఖ్య జనం ఒక్కటైనా.. సూపర్ స్ప్రెడ్డింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు.
కవాసకి వ్యాధి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని, అయిదేళ్ల లోపు ఉన్న చిన్నారులకు ఆ వ్యాధి సోకుతుందని, అయితే భారత్ లో ఆ కేసులు తక్కువే అని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ్ తెలిపారు.
భారత్‌లో కోవిడ్‌తో పాటు కవాసాకి రోగులు ఉన్నట్లు ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. భారత్ లో లో 17 ఏళ్లలోపు వారిలో 8 శాతం మంది మాత్రమే కోవిడ్ పాజిటివ్ ఉన్నారని, ఇక అయిదేళ్లలోపు ఆ సంఖ్య మరీ తక్కువగా ఉంటుందని వివరించారు.
More Stories
జమిలి ఎన్నికలకు పట్టుదలతో మోదీ ప్రభుత్వం
వైద్యులందరికీ ప్రత్యేక ఐడీలు
హిందూ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్ కాదు