ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ ప్రజలకు గట్టి మేలు చేస్తోంది. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి దాదాపు రూ.53,000 లబ్ధి చేకూర్చుతోంది. అతిసార వ్యాధి సోకకుండా చేయడంలో, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలులో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఈ కార్యక్రమంపై మొట్టమొదటిసారి నిర్వహించిన అద్యయనం ఈ వివరాలను వెల్లడించింది. ఈ అధ్యయనం వివరాలు సైన్స్ డైరెక్ట్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమం వల్ల జరిగిన ఖర్చులు, వచ్చిన ప్రయోజనాలను సరిపోల్చుతూ ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
2017 జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు 12 రాష్ట్రాల్లోని 10,051 గ్రామీణ కుటుంబాలను అధ్యయనం చేసి, ఈ నివేదికను రూపొందించారు. ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లు, పారిశుద్ధ్య సదుపాయాలను ఉపయోగించుకోవడం వల్ల సత్ఫలితాలు వస్తున్నట్లు తెలిపింది.
వ్యయంపై 2.6 రెట్లు ఫైనాన్సియల్ రిటర్న్, 5.7 రెట్లు సొసైటల్ రిటర్న్ వచ్చినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయన నివేదికను గుయ్ హుటన్, నికొలస్ ఆస్బెర్ట్, సుమీత్ పాటిల్, అవని కుమార్ రూపొందించారు.
స్వచ్ఛ భారత్ వల్ల అకాల మరణాల రేటు కూడా తగ్గినట్లు, ఫలితంగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులంతా తమ ఇంట్లోని మరుగుదొడ్డిని ఉపయోగించడం వల్ల సంవత్సరానికి దాదాపు రూ.24,000 ఆదా అవుతోందని తెలిపారు. ఇంటి బయట బహిరంగ మల, మూత్ర విసర్జనకు వెళ్ళే సమయం ఆదా అవుతోందని తెలిపారు.
More Stories
సైఫ్ అలీ ఖాన్పై దాడిలో అండర్వరల్డ్ హస్తం లేదు!
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు