బీహార్ బిజెపి నేతల్లో కరోనా కలకలం   

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తమ కూటమి గెలుపు కోసం విశేషంగా ప్రహకారం చేస్తున్న బిజెపి కీలక నాయకులలో కరోనా కలవరం ఆందోళన కలిగిస్తున్నది. ఈ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కరోనా బారిన పడడంతో కలకలం చెలరేగింది. 
 
బిహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. దాంతో ఆయన పాట్నాలోని ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే కేంద్ర మంత్రి షానవాజ్‌ హుస్సేన్‌ , పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రుడే లుకూడా పాజిటివ్‌గా తేలారు. 
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని  మోదీ చాలా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పలు బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. మోదీ, షానవాజ్‌ హుస్సేన్‌లకు‌  కరోనా పాజిటివ్‌గా తేలడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
“కరోనాకు పాజిటివ్ పరీక్షించారు. గత 2 రోజులుగా జ్వరం లేదు. మెరుగైన పర్యవేక్షణ కోసం పాట్నాలోని ఎయిమ్స్‌లో చేరారు. ఊపిరితిత్తుల సిటి స్కాన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం త్వరలో తిరిగి వస్తాను” అని ట్విట్టర్‌లో సుశీల్‌ కుమార్‌ మోదీ పేర్కొన్నారు.
బిహార్‌లో బీజేపీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి షానవాజ్ హుస్సేన్ కూడా కరోనా వైరస్ కోసం పాజిటివ్ పరీక్షించిన అనంతరం.. ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.
“కొవిడ్-19 కు పాజిటివ్ పరీక్షించిన కొద్ది మంది వ్యక్తులతో నేను సంప్రదింపులు జరిపాను. ఈ రోజు నన్ను నేను పరీక్షించుకున్నాను. నా నివేదిక సానుకూలంగా వచ్చింది.” అని షానవాజ్ హుస్సేన్ ట్వీట్ చేశారు.
షానవాజ్ హుస్సేన్, సుశీల్ కుమార్ మోదీతోపాటు ఆరోగ్య మంత్రి మంగల్ పాండే, మరో నేత రాజీవ్ ప్రతాప్ రూడీ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. బిహార్‌లో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించిన రెండు రోజుల తరువాత షానవాజ్ హుస్సేన్ కొవిడ్-19 నిర్ధారణ వచ్చింది.