నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై భారీ జరిమానాలు విధించేందుకు ఆంధ్రప్రదే ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి రవాణశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి కృష్ణబా
.ద్విచక్రవాహనంతో పాటు తేలికపాటి ఫోర్ వీలర్స్ ను ఒక కేటగిరీగా, భారీ వాహనాలను మరో కేటగిరీగా విభజించారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10,000, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారికి రూ.10 వేల జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.
రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ.2వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంతేకాదు వాహన బరువు చెకింగ్ కోసం ఆపకపోతే రూ.40 వేలు, ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేలు జరిమానా, అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ.2 వేలు ఫైన్ విధించనున్నారు.
వేగంగా వాహనం నడిపితే రూ. వెయ్యి జరిమానా విధించడంతోపాటు, నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో మార్పులు చేస్తే తయారీ సంస్థలు, డీలర్లు, అమ్మిన వారికి లక్ష రూపాయలు జరిమానా విధించనున్నారు.
More Stories
ఏడాదిలోగా గన్నవరంలో ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్
కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్
కూటమి ప్రభుత్వ సారధ్యంలో ఏపీ అభివృద్ధి ఖాయం