కరోనా వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో లాక్‌డౌన్ మాత్రమే ముగిసిందని, కరోనా వైరస్ ఇంకా ఉందని ప్రజలు గుర్తెరిగి ఉండాలని ఆయన సూచించారు. ఏడెనిమిది నెలల పాటు కరోనాపై మనం చాలా విజయవంతంగా పోరాడుతున్నామని, వైరస్ మళ్లీ విజృంభించకుండా చూసుకోవాలని ప్రధాని చెప్పారు.
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం ప్రసంగిస్తూ దసరా, దీపావళి, ఛట్ పూజ వంటి పంగుడల సీజన్‌లో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు చెప్పారు. కరోనా మహమ్మారిపై భారత్ విజయవంతంగా పోరాడుతోందని చెబుతూ దేశంలో దాదాపు 90 లక్షలకు పైగా కరోనా పథకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
రెండు వేలకు పైగా కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయని, కొద్ది రోజుల్లోనే దేశంలో కరోనా టెస్టుల సంఖ్య పది కోట్లను దాటబోతోందని ప్రధాని పేర్కొన్నారు. కరోనా టెస్టుల సంఖ్య పెరగడమంటే వైరస్‌పై పోరాటంలో మన బలం మరింత పెరుగుతున్నట్టేనని మోడీ చెప్పారు. కరోనా వైరస్ బారి నుంచి కోలుకుంటున్న వారి రికవరీ రేటు మన దేశంలో చాలా మెరుగ్గా ఉందని ప్రధాని చెప్పారు.
అమెరికా, బ్రెజిల్, యూకే వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉందని మోదీ తెలిపారు. అమెరికా లాంటి దేశాల్లో ప్రతి పది లక్షల మందిలో 600 మందికి పైగా కరోనాకు బలవుతున్నారని, భారత్‌లో ఈ సంఖ్య 83 మాత్రమేనని చెప్పారు. మన దేశంలో ప్రతి పది లక్షల మందిలో 5500 మందికి కరోనా వచ్చింది, అయితే అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ఈ సంఖ్య 25 వేలకు పైగా ఉందని వివరించారు.
కరోనాపై జనతా కర్ఫ్యూ మొదలు ఏడెనిమిది నెలలుగా పోరాడుతున్నామని, ఇప్పుడిప్పుడే ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటోందని ప్రధాని తెలిపారు. ప్రజలంతా ధైర్యంగా వాళ్ల భాద్యతను, రోజు వారీ పనులను చూసుకునేందుకు యటకు వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం పండుగల సీజన్‌లో మార్కెట్లకు కొత్త కళ వచ్చిందని అన్నారు.
అయితే లాక్ డౌన్ మాత్రమే ముసిగిందని, కరోనా వైరస్ ఎక్కడికీ పోలేదన్న విషయం మనమంతా గుర్తుంచుకోవాలని ఆయన అప్రమత్తం చేశారు. కరోనా వైరస్ బారినపడకుండా అన్ని రకాల జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని సూచించారు. అజాగ్రత్తగా వ్యవహరించి మళ్లీ కరోనా మహమ్మారి విజృంభించే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.
‘కొంతమంది జనం గుమ్మిగూడి, ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతున్న వీడియోలు, ఫొటోలు కొన్ని ఇటీవలే చూశాం. ఆ తరహా ప్రవర్తన మనకే ప్రమాదకరం. మాస్కు లేకుండా బయటకు వస్తున్నారంటే మీ కుటుంబం మొత్తాన్ని రిస్క్‌లో పెడుతున్నారని గుర్తుంచుకోవాలి. ఐరోపా దేశాల్లోనూ కొన్ని చోట్ల కరోనా కేసులు తగ్గినా మళ్లీ అకస్మాత్తుగా భారీగా పెరిగిన సందర్భాలు ఉన్నాయి’ అని మోదీ గుర్తు చేశారు.
ప్రపంచంలో అనేక దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నాయని చెబుతూ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దేశంలోని ప్రజలందరికీ వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ఆయన భరోసా ఇచ్చారు.
వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం, శానిటేషన్ లాంటివి మర్చిపోకూడదని స్పష్టం చేశారు.
More Stories
కంగనా విచారణకు హాజరు కావాలని చండీగఢ్ కోర్టు నోటీసు
పదేళ్ల తర్వాత నేడే జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు
గణేష్ పూజను కూడా ఓర్వలేకపోతున్న కాంగ్రెస్