పార్టీ నిర్ణయాలు, నియమావళికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుబిన్నారన్న ఆరోపణలపై మాజీ ఏపీ అధికార ప్రతినిధి, జేపీ నేత లంకా దినకర్‌ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ విధానానికి, అభిప్రాయాలకు వ్యతిరేకంగా సొంత అజెండాతో టివి చర్చల్లో పాల్గొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
గతంలో జారీచేసిన షోకాజ్ నోటీసుకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా, మళ్లీ టీవీ చర్చల్లో పాల్గొన్నాంటున్నారని పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఆయన్నితొలగిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ విధానపరమైన నిర్ణయాలపై ఎలాంటి సమాచారం లేకుండా టీవీ చర్చల్లో పాల్గొన్ని చర్చించవద్దని ఇంతకుముందు లంకా దినకర్‌కు షోకాజు నోటీసులు జారీచేసింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తన ఎలాంటి మార్పురాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆగ్రహించిన అధిష్టానం వేటు వేసింది.
గతంలో టీడీపీలో కొనసాగిన లంకా దినకర్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి అనంతరం బీజేపీలో చేరారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలను కొందరు టీడీపీ నేతలకు చేరవేస్తున్నట్లు దినకర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
More Stories
తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని
ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తాం
ఒకేరోజు 13,326 గ్రామసభలతో ఏపీ ప్రపంచ రికార్డు