అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో చెత్త అభ్యర్థి పోటీ చేయడం తనపై ఒత్తిడిని పెంచుతోందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాను ఓడిపోతే ఏం జరుగుతుందో మీరుఊహించగలరా, అప్పుడు తనకు మంచి జరిగే అవకాశం ఉండదని, దేశం విడిచి వెళతానని ట్రంప్ వ్యాఖ్యానించారు.
డెమోక్రటిక్ ప్రత్యర్థి జోబిడెన్ కమ్యూనిస్టులను, క్రిమినల్ వలసదారులను దేశంలోకి అనుమతిస్తారని జార్జియాలోని ఫ్లోరిడాలో ర్యాలీ సందర్భంగా ట్రంప్ విరుచుకుపడ్డారు. అమెరికాలో కరోనా కేసుల పెరుగుదల కూడా ట్రంప్‌కు ఇబ్బందికర పరిస్థితులను కల్పించింది. దీంతో బిడెన్ విజయావకాశాలను ట్రంప్ అంగీకరించినట్లు కనిపిస్తోంది.
అధ్యక్ష ఎన్నికలకు మరో 17 రోజులు మాత్రమే మిగిలి వుండటంతో బిడెన్‌పై విమర్శలనే ట్రంప్ ప్రచారాస్త్రాలుగా ఎంచుకున్నారు. బిడెన్ కుట్ర పూరితంగా ఆలోచిస్తున్నారని, కమ్యూనిస్టులను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నరు. అలాగే బిడెన్ కుటుంబం క్రిమినల్ ఉద్దేశాలను కలిగిఉందని ఆరోపిస్తున్నారు.
బిడెన్ అమెరికాను కమ్యూనిస్ట్ దేశంగా మార్చాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. డెమోక్రాట్లు మీ కమ్యూనిటీలను అక్రమ వలసదారులు, డ్రగ్స్, నేరాలతో నింపుతారని ఆరోపించారు. అలాగే ట్రంప్‌ను బహిరంగంగా విమర్శించిన ఇల్హాన్ ఒమర్‌పై కూడా విరుచుకుపడ్డారు.
ఆమె మన దేశాన్ని ద్వేషిస్తోందని, ప్రభుత్వం కూడా లేనటువంటి ప్రదేశం నుండి వచ్చారని తెలిపారు. నిల్సెన్ రేటింగ్ డేటా అందించిన వివరాల ప్రకారం 14.1 మిలియన్ల మంది బిడెన్ ప్రచారాన్ని చూడగా, 13.5 మిలియన్ల మంది మాత్రమే ట్రంప్ ప్రచారాన్ని చూశారు.
More Stories
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ జయకేతనం
అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్, విల్మోర్
అదానీ విద్యుత్ ఒప్పందాన్ని పరిశీలిస్తాం