
కమీషన్ల కక్కుర్తి వల్లే కల్వకుర్తి పంప్ హౌజ్ మునిగిపోయిందని బిజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ధ్వజమెత్తారు. పంప్ హౌజ్ ను ఓపెన్ గ్రౌండ్ లో చేపట్టాలని నిపుణుల కమిటీ సూచించైనా కమీషన్లకు కక్తుర్తి పడి అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపట్టారని ఆమె ఆరోపించారు.
పాలమూరు ప్రజలంటే కేసీఆర్ కు వివక్ష ఎందుకని ఆమె ప్రశ్నించారు. కృష్ణానదిపై కట్టిన ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు.
కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు సాధించుకోవడానికి అనేక ఉద్యమాలు, పాదయాత్రలు, ఆమరణ నిరాహారదీక్షలతో పోరాడి ఈ ప్రాజెక్టులను పూర్తిచేశామని ఆమె గుర్తు చేశారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 8 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని సంకల్పించామని, తెలంగాణ ఏర్పాటు నాటికే ఈ ప్రాజెక్టుల పనులు 80శాతానికి పైగా పూర్తయ్యాయని అరుణ తెలిపారు.
మరో రూ.2వేల కోట్ల నుంచి రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టులు పూర్తయి, వందకు వంద శాతం నీటిని అందించే అవకాశం ఉండేదని ఆమెపేర్కొన్నా న్నారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకాలపై నిర్లక్ష్యం చేసిందని ఆమె విమర్శించారు.
More Stories
మంత్రి మల్లారెడ్డిని బర్తరఫ్ చేయాలి
టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళనకు పట్టించుకోని ప్రభుత్వం
బీఆర్ఎస్ ఎంపీ ఫౌండేషన్‌కు భూమి కేటాయింపును రద్దు!