మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొషియారీ ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో వాడిన భాష సరిగాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుబట్టారు. ‘ఆ లేఖలో ఎంచుకున్న పదాలు సబబుకాదు. గవర్న ర్ సంయమనం పాటించి లేఖ రాసి ఉండాల్సింది’ అని షా ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
‘నేను ఆ లేఖను చదివాను. ఆయన సెక్యుల ర్ అన్న పదాన్ని మామూలుగా ఉటంకించారు. అయినా దాన్ని వాడకుండా ఉండాల్సింది’ అని సున్నితంగా గవర్నర్ చర్యను మందలించారు. మహారాష్ట్రలో దేవాలయాలు, ప్రార్థనా స్థలాలను తిరిగి తెరవడంపై కొషియారీ సీఎంకు లేఖ రాశారు. భారీ జన సమూహాలు గుమిగూడితే కొవిడ్ విషమించవచ్చని, అందుకే ఆలయాలు తెరవడం లేదని ఉద్ధవ్ పేర్కొనడా న్ని విమర్శిస్తూ కొషియారీ లేఖ రాశారు.
‘విచిత్రం ఏమిటంటే మీరు బార్లు తెరుస్తారు, రెస్టారెంట్లు తెరుస్తారు, బీచ్‌లు తెరుస్తారు. దేవుళ్లు, దేవతలను నిరంతరం లాక్‌డౌన్‌లోనే ఉంచుతున్నారు. మీకేమైనా దివ్య సంకేతా లు అందుతున్నాయా? ప్రార్థనా స్థలాలను తెరవడాన్ని వాయిదా వేస్తున్నారు? సెక్యులర్ పదాన్ని ఎన్నో ఏళ్ల పాటు ద్వేషించిన మీరు ఆకస్మికంగా లౌకికవాదిగా మారిపోయారా?’ అని గవర్నర్ హేళనగా ప్రశ్నించారు.
ఈ లేఖ ప్రకంపనలు రేపింది. దీనికి ఉద్ధవ్ దీటుగానే కౌంటర్ ఇచ్చారు. ‘మీ ఉద్దేశం ఆలయా లు తెరిస్తే హిందూత్వం కింద లెక్క. కాదంటే సెక్యులర్ అనా? సెక్యులర్ అన్న పదం మన రాజ్యాంగంలోనే ఉంది. దాన్ని కాపాడతామనే మీరు ప్రమాణ స్వీకారం చేసిన విషయాన్ని మరవొద్దు’ అంటూ ధ్వజమెత్తారు.
పైగా,`లేఖలో హిందూత్వం గురించి ప్రస్తావించారు. మీ నుంచి హిందూత్వంపై పాఠాలు నేర్వాల్సిన పనిలేదు. మీ లేఖ ఓ రాజకీయ పార్టీకి కొమ్ముకాసేదిగా ఉంది. ముంబైని పాక్-ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చి న వారిని (కంగన రనౌత్) ఇక్కడకు రానివ్వకపోవడం నాకు తెలిసిన హిందూత్వం’ అని ఘాటుగా బదులిచ్చా రు.
ఈ లేఖ బీజేపీకి, శివసేన-కాంగ్రె్‌స-ఎన్సీపీలకు మధ్య తీవ్ర వివాదం రగిలించింది. గవర్నర్ లేఖను అమిత్ షా తప్పుబట్టడం హర్షణీయమని, ఈ వివాదం ముగిసినట్లేనని శివసేన వ్యాఖ్యానించింది. గవర్నర్ ఆ లేఖ రాయడమే అనవసరమని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
More Stories
మిత్రుడు ట్రంప్ కు ప్రధాని మోదీ అభినందనలు
అమెరికన్లకు ఇక స్వర్ణయుగమే
తెలుగు వారి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు