
జిన్నా సిద్ధాంతాలకు మద్దతుపై కాంగ్రెస్ పార్టీ, మహాకూటమి స్పష్టత ఇవ్వాలని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జలే నియోకవర్గం నుంచి దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న మస్కూర్ అహ్మద్ ఉస్మానిని కాంగ్రెస్ నిలబెట్టటంపై కేంద్ర మంత్రి విస్మయం వ్యక్తం చేశారు.
‘కాంగ్రెస్, మహాకూటమి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. బీహార్ సంక్షేమానికి పాటుపడతామని వారు చెబుతున్నారు. జలే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జిన్నా ఆరాధకుడిని బరిలోకి దింపారు. జిన్నా సిద్ధాంతాలపై ఆర్జేడీ, కాంగ్రెస్ పోరాడదలచుకున్నాయా? వారి స్టార్ క్యాంపెయినర్ సర్జీల్ ఇమామా?’ అని గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు.
లాలూ హయాంలో ‘సిమి’కి స్థావరంగా బీహార్ మారిందని, సిమి దేశభక్తి సంస్థగా చెప్పదలచుకున్నారా ఆని ఆయన నిలదీశారు. కేవలం ఓట్ల కోసం బీహార్, దేశం చిక్కుల్లో పడకూడదని, వాళ్లు (కాంగ్రెస్ కూటమి) ఓటు కోసం ఏదైనా చేస్తారని విమర్శించారు.
కశ్మీర్‌లో 370 అధికరణను పునరుద్ధరించేందుకు ఫరూక్ అబ్దుల్లా, ఇతర పార్టీలు చర్చలు జరుపుతుండటంపై మాట్లాడుతూ, ఫరూక్ చైనా వైపు మాట్లాడుతున్నారని, చైనా, పాకిస్థాన్‌లు భారతదేశానికి శత్రువులనే విషయం అందరికీ తెలుసునని గిరిరాజ్ సింగ్ ధ్వజమెత్తారు.
దేశాన్ని విభజించే వాళ్లతో ఉండాలనుకుంటున్నారో, గాంధీతో ఉండాలనుకుంటున్నారో కాంగ్రెస్, ఆర్జేడీలు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. .
More Stories
క్రికెట్ బుకీని పట్టించిన అమృతా ఫడ్నవీస్
రక్షణ రంగంలో భారత్, అమెరికా పారిశ్రామిక సహకారం
జూన్ 11న సచిన్ పైలట్ సొంత పార్టీ ప్రకటన?