
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నగరంలో బీజేపీ ఉపాధ్యక్షుడిపై గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి కాల్పులు జరిపిన ఘటన సంచలనం రేపింది. కొందరు ఆగంతకులు బుల్లెటుపై వచ్చి ఫిరోజాబాద్ మండల బీజేపీ ఉపాధ్యక్షుడు డీకే గుప్తాపై కాల్పులు జరిపి పారిపోయారు.
ఈ కాల్పుల్లో తీవ్ర బుల్లెట్ గాయాలైన గుప్తాను ఆగ్రాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని డాక్టర్లు చెప్పారు. గుప్తా ఉప ఎన్నికల్లో తుండ్లా బీజేపీ అభ్యర్థికి మద్ధతు ఇస్తున్న నేపథ్యంలో ఈ హత్య జరిగింది.
కిరాణా దుకాణం నిర్వహిస్తున్న గుప్తా వద్దకు ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బుల్లెట్ పై వచ్చి కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఫిరోజాబాద్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది.
గుప్తా కుటుంబ సభ్యులు కొందరిపై అనుమానం వ్యక్తంచేశారని, వారి పేర్లు నమోదుచేసుకున్నామని ఫిరోజాబాద్ సీనియర్ ఎస్పీ సచింద్ర పటేల్ తెలిపారు. దర్యాప్తు చేస్తున్నామని వెళ్లడించారు.
More Stories
రాజద్రోహం సెక్షన్ కొనసాగాల్సిందే.. శిక్ష కూడా పెరగాలి
ఉన్నత స్థితికి భారత్ నేపాల్ సంబంధాలు
మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు, డిజిపిపై వేటు