బీహార్ ఎన్నికల ముందు కాంగ్రెస్ డ‌ర్టీ పాలిటిక్స్  

బీహార్ ఎన్నిక‌ల‌కు మందు కాంగ్రెస్ పార్టీ డ‌ర్టీ పాలిటిక్స్ ప్లే చేస్తోందంటూ ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జెపి నడ్డా  విరుచుపడ్డారు.  జ‌మ్మూ కశ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ని తిరిగి పున‌రుద్ద‌రించాల‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్య‌ల‌ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
సుపరిపాలన గురించి మాట్లాడక, దేశాన్ని విభజించే నీచమైన ట్రిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.  జ‌మ్మూ కశ్మీర్‌లో ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ట్వీట్ చేశారు. బీహార్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఎజెండా లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తోంద‌ని విమర్శించారు.
 
‘‘సుపరిపాలన గురించి కాంగ్రెస్ మాట్లాడటం లేదు. బిహార్ ఎన్నికల ముందు దేశాన్ని విభజించే రాజకీయాలకు తెరలేపారు. రాహుల్ పాక్‌ను పొగిడారు. ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలని చిదంబరం డిమాండ్ చేస్తున్నారు. సిగ్గుచేటు’’ అని నడ్డా ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. 
 
 పార్టీనే తాము కుటుంబంలా భావిస్తామని బీజేపీ నడ్డా స్పష్టం చేశారు. ‘‘ఓ పార్టీ గనక రాజకీయ నేత ఇంట్లోంచి పనిచేస్తే… ఆ పార్టీ ఆ వ్యక్తికి చెందుతుంది. మిగితా పార్టీలకు కుటుంబమే పార్టీ. కానీ… తమకు మాత్రం.. పార్టీయే మా కుటుంబం.’’ అని నడ్డా ప్రకటించారు.
 
 కాంగ్రెస్ తో సహా ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబీకులను రక్షించుకునే పనిలో బిజీగా ఉంటాయని ఎద్దేవా చేశారు. కానీ బీజేపీ అలా ఉండదని నడ్డా స్పష్టం చేశారు