అయోధ్య ఆలయ పునాది పనులు ప్రారంభం 

అయోధ్యలోని రామ జన్మభూమి నిర్మాణ వర్క్‌షాప్‌లో చెక్కిన రాళ్లను రామ జన్మభూమి ఆవరణలోని తాత్కాలిక వర్క్‌షాప్‌కు తీసుకెళ్లే ప్రక్రియ ప్రారంభమైంది. వర్క్‌షాప్‌లోని రాళ్లను రెండోసారి రామ జన్మభూమి క్యాంపస్‌కు తీసుకెళ్తున్నారు. పునాదిపైన ఉన్న నాలుగు స్తంభాలను క్రేన్ ద్వారా పెద్ద ట్రక్కులో అమర్చి తరలించారు.

రామాలయ నిర్మాణ సమయంలో అవసరమైనప్పుడు రాళ్లను తొలగించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు చెక్కిన రాళ్లను వర్క్‌షాప్ నుంచి మొదట పునాది స్తంభం రవాణా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గురువారం నుంచి రామాలయ పునాదికి స్తంభాలు నిర్మించే పనులు ప్రారంభం అవుతున్నాయి.

ఈ స్తంభాలను భూగర్భంలో వ్యవస్థాపించి దానిపై పునాది నిర్మాణం జరుపుతారు. ఈ స్తంభాల మొత్తం సంఖ్య 1200 కాగా, ఇప్పటివరకు 3 స్తంభాల నిర్మాణపనులు పూర్తయ్యాయి. వీటిని ఐఐటీ రూర్కీ, ఎల్ అండ్ టీ సంస్థలు పరీక్షించాయి. స్తంభాల గట్టిదనం పరీక్ష పూర్తికావడంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పునాది పనులు గురువారం నుంచి ప్రారంభమవుతాయని రామజన్మభూమి ట్రస్ట్‌ తెలిపింది.

2021 నాటికి పునాది పనులు పూర్తవుతాయి. ఆ తరువాత పునాది పైన నిర్మాణాన్ని నిర్మించే పనులు మొదలవుతాయి. నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా స్తంభాలను నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా రామ్ జన్మభూమి పరిషత్ తాత్కాలిక వర్క్‌షాప్‌కు అందజేయాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోరుకుంటున్నది. 

రాళ్లను మోసే ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైందని, ఈ రాళ్లను అక్కడకు తీసుకెళ్లడం ద్వారా ఆలయంలో ఎన్ని రాళ్లను ఏర్పాటు చేయాలో, ఎన్ని ప్రదేశాల్లో నాటాలి అనే దానిపై మొదట లెక్కింపు జరుగుతుందని ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రతినిధి రాహుల్‌ చెప్పారు. రాళ్లను తీసుకొని తాత్కాలిక వర్క్‌షాప్‌లో ఉంచి ఆలయ నిర్మాణం ప్రకారం వాటిని లెక్కించి శుభ్రం చేస్తారని తెలిపారు.

కాగా, రామాలయం నిర్మిస్తున్న అయోధ్య నగరంలో కొత్త ప్రాజెక్టు నిర్మాణం కోసం యోగి ఆదిత్యనాథ్ సర్కారు భూసేకరణకు శ్రీకారం చుట్టింది. 

విల్లు ఆకారంలో అయోధ్య టౌన్ షిప్ నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ హౌసింగ్ డెవలప్ మెంటు బోర్డు భూసేకరణ కోసం సెక్షన్ 28 గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అయోధ్య అథారిటీ కార్యాలయంలో నిపుణులైన ఇంజినీర్లు, వాస్తుశిల్పులు కొత్త ప్రాజెక్టు డిజైన్ ను సిద్ధం చేస్తున్నారు.

కొత్త అయోధ్యలో మంజాతిరుహా, మంజా బరేత, షహనావాజ్ పూర్ ప్రాంతాల్లో 1193 ఎకరాల భూమిని సేకరిస్తామని, దీని కోసం రూ.4వేల కోట్లు మంజూరు చేశామని అయోధ్య డెవలప్ మెంటు అథారిటీ వైస్ ఛైర్మన్, మున్సిపల్ కమిషనర్ విశాల్ సింగ్ చెప్పారు. అయోధ్యను ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని విశాల్ సింగ్ చెప్పారు.