సరిహద్దులో వివాదాలు సృష్టించేందుకు ఓ పధకం ప్రకారం పాక్, చైనాలు పనిచేస్తున్నాయని రక్షణమంత్రి రాజ్‌నాథ్ ఆరోపించారు. సరిహద్దుల్లో నిర్మించిన 44 వంతెనలను జాతికి అంకితం చేసిన తర్వాత ఆయన వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న పరిస్థితి గురించి మీకందరికీ తెలుసు అని, మొదట పాకిస్థాన్, ఇప్పుడు చైనా సరిహద్దుల్లో ఓ పథకం ప్రకారం వివాదాలు సృష్టిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
‘‘ఉత్తర, తూర్పు సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులను సృష్టిస్తున్నారో మీకు తెలియంది కాదు. తొలుత పాకిస్థాన్ ఆ పని చేయగా, ఇప్పుడు చైనా కూడా అదే పనిచేస్తోంది. ఓ ప్రత్యేక లక్ష్యం (మిషన్)తో చైనా సరిహద్దు వివాదాలను సృష్టిస్తున్నట్టు అనుమానంగా ఉంది. మనకు ఈ రెండు దేశాలతో 7 వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా ఉందని చెబుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఆ సమస్యను ఎదుర్కొంటున్నదని, అనేక మార్పులు కూడా చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
రాజ్ నాథ్ సింగ్ ఆర్మీకి చెందిన 44 వంతెనలను ప్రారంభించారు. ఆర్మీ ర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ దేశ సరిహద్దుల్లో మొత్తం 102 వంతెనలల నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది. అందులో 44 వంతెనలు పూర్తయ్యాయి. వాటిలో 30 వంతెనలు వాస్తవాధీన రేఖ వెంబడి లఢాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వాస్తవాధీన రేఖలో చైనా ఆర్మీ ఆక్రమణల్ని తిప్పికొట్టేందుకు భారత్ తూర్పు లడఖ్ సెక్టార్ కు టీ – 90 భీష్మ యుద్ధ ట్యాంకుల్ని మోహరించింది. ఆ యుద్ధ ట్యాంక్ బరువు 45టన్నులు ఉండగా భారత్ నిర్మిన్నన్న 102 వంతెనలు 70టన్నుల బరువు మోయగల సామర్ధ్యం ఉంది. వీటి వల్ల ప్రదేశాల మధ్య దూరాల్ని త్వరగా చేరుకునేందుకు , ఎల్ ఓసీ వద్ద అత్యవసర పరిస్థితుల్లో సైనికుల్ని మోహరించేందుకు ఉపయోగపడుతున్నాయి.
ఈ వంతెనలు సైన్యంకు చెందిన భారీ యుద్ద ట్యాంకుల రవాణా కోసం ఉపయోగించనున్నారు. ఇవి జమ్మూ కాశ్మీర్ (10), లడఖ్ (8), హిమాచల్ ప్రదేశ్ (2), పంజాబ్ (4), ఉత్తరాఖండ్ (8), అరుణాచల్ ప్రదేశ్ (8), సిక్కిం (4) లో 44 వంతెనలను నిర్మించినట్లు లెఫ్టినెంట్ జనరల్ సింగ్ తెలిపారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్మించనున్న నేచిపు టన్నెల్‌కు ఆయన లాంఛనంగా శంకుస్థాపన చేశారు.
More Stories
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ
కోల్‌కతా పోలీస్ కమిషనర్‌పై వేటుకు మమతా సమ్మతి
ప్రతిపక్షాలకు దేశం పట్ల ఎటువంటి బాధ్యత లేదు